Pooja Hegde Got 4 Disasters in 2022: మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ముంబైలోనే పుట్టి పెరిగింది. అక్కడే చదువుకుని మోడలింగ్ చేస్తూ తమిళ్ సినిమా ముగమూడిలో హీరోయిన్ అవకాశం దక్కించుకుని, ఆ సినిమా ద్వారా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోయినా ఆమెకు తెలుగులో ముకుంద అనే సినిమా అవకాశం దొరికేలా చేసింది. ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగులో లాంచ్ అయింది కానీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.
తెలుగు కూడా కలిసి రాకపోవడంతో హిందీలో మొహంజదారో అనే సినిమాలో హీరోయిన్ పాత్ర దక్కించుకుంది. అనూహ్యంగా ఆ సినిమా కూడా ఆమెకు క్రేజ్ అయితే తీసుకు రాలేదు. తర్వాత తెలుగులో చేసిన డీజే- దువ్వాడ జగన్నాథం సినిమా ఆమెకు హీరోయిన్గా గుర్తింపు తీసుకురావడమే కాక ఒక్కసారిగా లైమ్ లైట్లోకి తీసుకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన అనేక సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
అరవింద సమేత వీర రాఘవ, మహర్షి ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు కూడా ఆమెకు హిట్లుగా నిలిచాయి. అయితే ఈ ఏడాది అంటే 2022 మాత్రం పూజా హెగ్డే కెరీర్ లో డిజాస్టర్స్ ఎక్కువ వచ్చేలా చేసింది. ముందుగా ఆమె ప్రభాస్ తో చేసిన రాధేశ్యాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడమే కాక ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది.
తర్వాత ఆమె ఒక చిన్న పాత్రలో చేసిన ఆచార్య సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ ఇద్దరి కెరీర్లోనూ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే ఆమె నటించిన బీస్ట్ సినిమా కూడా దారుణాతి దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ సినిమాను ఆదరించే వాళ్ళు కొంతమంది ఉన్నా మెజారిటీ మాత్రం సినిమా బాలేదని పక్కన పెట్టారు. దీంతో ఒక రకంగా ఈ సంవత్సరం మూడు సినిమాలతో డిజాస్టర్లు అందుకుంది పూజా హెగ్డే.
అయితే ఈరోజు హిందీలో ఆమె నటించిన సర్కస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రావడమే కాక బుకింగ్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఈ ఏడాది పూజా హెగ్డే చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలిచినట్లయింది.
నిజానికి ఆమెను గతంలో ఐరన్ లెగ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు అయితే డీజేతో ఆమె దశ తిరిగింది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసిన తరువాత ఆమె మళ్ళీ ఐరన్ లెగ్ గా మారిపోయింది అనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల నిర్మాతలు, మేకర్స్ కూడా ఆమె గురించి భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: Raviteja Dhamaka Review: రవితేజ ధమాకా సినిమా ఎలా ఉంది? రివ్యూ - రేటింగ్ మీకోసం!
Also Read: Kaikala Satyanarayana Last Wish: చిరంజీవిని కోరిన చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల.. అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.