Pawan Kalyan in Unstoppable : ఆ ప్రశ్నలు మాత్రం అడగకండి!.. బాలయ్యకు పవన్ రిక్వెస్ట్?

Pawan Kalyan Request Balakrishna పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కలిసి కనిపించిన ఫోటోనే నెట్టింట్లో దుమారం లేపుతుంటే..ఈ ఇద్దరూ కలిసి అన్ స్టాపబుల్ షోలో కనిపిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 09:35 AM IST
  • దూసుకుపోతోన్న బాలయ్య టాక్ షో
  • గెస్టుగా రాబోతోన్న పవన్ కళ్యాణ్‌
  • ఆ ప్రశ్నలపై అభ్యంతరాలు?
Pawan Kalyan in Unstoppable : ఆ ప్రశ్నలు మాత్రం అడగకండి!.. బాలయ్యకు పవన్ రిక్వెస్ట్?

Pawan Kalyan Request Balakrishna పవన్ కళ్యాణ్‌, బాలకృష్ణ కలిసి ఉన్న ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ ఇద్దరూ తమ తమ షూటింగ్‌ల కోసం అన్నపూర్ణ స్టూడియోలో కలిశారు. బాలయ్య వీర సింహా రెడ్డి షూటింగ్, పవన్ కళ్యాణ్‌ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లోనే ఇలా మీటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షో గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్‌ వచ్చినట్టు సమాచారం. పైగా ఈ టాక్ షో గురించి తెలిసిందే. ఇందులో పర్సనల్ విషయాలు, ఎక్కువగా ఎదుర్కొనే విషయాల మీదే ప్రశ్నలు సంధిస్తుంటాడన్న విషయం తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్‌ విషయంలో అయితే పెళ్లిళ్లే కాంట్రవర్సీలు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయం మీదే పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తుంటారు. నిన్నటికి నిన్న సీఎం జగన్‌ మళ్లీ పవన్ కళ్యాణ్‌ భార్యల విషయం ప్రస్థావించాడు.

ఇప్పుడు బాలయ్య కూడా అన్ స్టాపబుల్ షోలోనూ మళ్లీ తన వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నలు వేస్తాడో ఏమో అని పవన్ కళ్యాణ్‌ ముందు జాగ్రత్త పడ్డాడట. తన పెళ్లిళ్లు, భార్యల విషయాలు, వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నలు వేయొద్దని బాలయ్యను రిక్వెస్ట్ చేశాడట పవన్ కళ్యాణ్. ఒక వేళ అడిగిన తరువాత చెప్పినా, చెప్పకుండా తప్పించుకున్నా అది బాగుందని పవన్ కళ్యాణ్‌ ఇలా ముందు జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది.

మొత్తానికి ఈ ఎపిసోడ్ కోసం అంతా వెయిట్ చేసేలానే ఉన్నారు. బాలయ్య, పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్ మాత్రం ది బెస్ట్‌గా ఉండేట్టు తెలుస్తోంది. అది రికార్డ్ వ్యూస్ కొట్టేలానే కనిపిస్తోంది.

Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్

Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News