No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?

Pawan Kalyan is No More Power Star Here Is The Reason : పవన్ కళ్యాణ్ ను ఇక మీదట పవర్ స్టార్ అని పిలవలేరు. ఎందుకో కారణం తెలుసా?

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 2, 2022, 01:15 PM IST
No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?

Pawan Kalyan is No More Power Star Here Is The Reason : రీ ఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. తర్వాత భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్స్ మాత్రం కొంత ఊరట నిచ్చాయి. ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేస్తున్నారు.

అందులో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా చేస్తానని ఆఫ్ ది రికార్డ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఇప్పుడు ఆయన మరో తమిళ రీమేక్ సినిమా కూడా చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పవర్ ప్యాక్డ్ వీడియో విడుదల చేసింది సినిమా యూనిట్.

అయితే ఈ సినిమా యూనిట్ ఆసక్తికరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు నుంచి పవర్ స్టార్ బిరుదును తొలగించి శ్రీ పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సభలలో ప్రసంగిస్తున్న సందర్భంగా తనను ఇక మీదట పవర్ స్టార్ అని సంబోధించ వద్దు అని పవర్ లేనివాడికి పవర్ స్టార్ అనే బిరుదు ఎందుకు అని ప్రశ్నించారు? తనను జనసేనాని అని సంబోధించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ తన సినిమాలకు పవర్ స్టార్ అనే ట్యాగ్‌ని ఉపయోగించవద్దని నిర్మాతలకు స్పష్టంగా సూచించారట.

ఆయనకు ఈ ట్యాగ్ నచ్చలేదని, అందుకే ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నారని అంటున్నారు. వకీల్ సినిమాకు ఈ పవర్ స్టార్ అనే ట్యాగ్‌ని చివరిసారి ఉపయోగించారు. ఇక పై పవన్ నటించే ఏ సినిమాలకు పవర్ స్టార్ టాగ్ ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ముందు ఉన్న పవర్ స్టార్ అనే బిరుదును  హరిహర వీరమల్లు సినిమా యూనిట్ తొలగించడం జరిగింది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ బిరుదు ఇచ్చింది ఆయన మీద ఈ మధ్యకాలంలో పలు తీవ్రమైన ఆరోపణలు గుప్పించి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన పోసాని కృష్ణ మురళి.

పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత అనే సినిమాకు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒకసారి పవన్ కళ్యాణ్ ను చూసిన పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ అనే క్యాప్షన్ ఈయనకు కరెక్ట్ గా సూట్ అవుతుందని సినిమా యూనిట్ తో అనడంతో వారు ఆయనకు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. అయితే ఇప్పుడు పవన్ తనను అలా పిలవ వద్దని కోరడం ఆసక్తికరంగా మారింది. 

Also Read: Happy Birthday Pawan Kalyan: పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌.. వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్!

Also Read: Ranga Ranga Vaibhavanga Review: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ కు తగినట్టుగానే ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News