Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?

Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి. తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 9, 2024, 02:30 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  ఊపిరి పీల్చుకోండి..  ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?

Pawan Kalyan: అవును గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలతో కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపారు పవన్ కళ్యాణ్. జగన్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడానికి తాను సీట్ల విషయంలో ఎంతో తగ్గాడు. దానికి తగ్గ ఫలం అందుకున్నారు జనసేనాని. అంతేకాదు ఏపీతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషించాడు. అంతేకాదు 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వందకు వంద శాతం సీట్లలో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేనా రికార్డు క్రియేట్ చేసింది.

కూటమిగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కు క్యాబినేట్ మంత్రి పదవి ఆఫర్ చేసినా..ఏపీ బాగు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలు చేయడంపై అనుమానాలు రేకెత్తించాయి. తాజాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓ 15 రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అయ్యే సినిమాలు రెండు ఉన్నాయి. అందులో సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ 10 రోజులు చేస్తే సినిమా కంప్లీట్ అవుతోంది. దాంతో పాటు హరి హర వీరమల్లు సినిమా కోసం ఓ నెల రోజులు డేట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

దీంతో ఈ సినిమా ఆగిపోలేదని హింట్ ఇచ్చారు మేకర్స్. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకు ఓ వారం రోజుల పాటు.. మిగిలిన వారం రోజుల్లో  2 రోజులు పాటు ఈ సినిమాలకు డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు పూర్తి చేసి మిగిలిన సినిమాలు చేయాలా వద్దా అనే దానిపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ  నిర్ణయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిరవగా .. ‘బ్రో’ మూవీతో పలకరించారు. ఆ తర్వాత రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. మరి 2024 యేడాదిలో పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా రిలీజ్ కాబోతుందా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News