Pawan Kalyan Birthday: పవన్ బర్త్ డే స్పెషల్.. 'వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్ డేట్..

Pawan Kalyan Birthday: నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'హరిహర వీరమల్లు' మూవీటీమ్ పవన్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేటంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 08:55 AM IST
Pawan Kalyan Birthday: పవన్ బర్త్ డే స్పెషల్.. 'వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్ డేట్..

Pawan Kalyan Birthday Special: ఇవాళ(సెప్టెంబరు 02) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే(Pawan Kalyan Birthday). ఈ సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీటీమ్ పవన్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. పవన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్.. రౌడీలను చితకబాది సీరియస్ గా నడుస్తూ వెళ్తున్నట్లు కనిపించారు. ఈ పోస్టర్ లో ఆయన వెనకాల భారీగా జనం గూమిగుడి ఉన్నారు. 

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ రెండేళ్ల కిందటే మెుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ రోజులు కేటాయించాల్సి రావడంతో.. వేరే చిత్రాలపై పవన్ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేయనున్నారు. అనంతరం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీని తీసుకురావాలని మేకర్స్ ఫ్లాన్స్ చేస్తున్నారు. 

హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహీ కీ రోల్స్ చేస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.  ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి వ్యవహారిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పవర్ గ్లాన్స్ టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'ఓజీ' సినిమా టీజర్ కూడా ఇవాళే రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్‍సింగ్' నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. 

Also Read: Aparna P Nair: ప్రముఖ సీరియల్ నటి అనుమానాస్పద మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News