Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2కు అరుదైన రికార్డు, ఇన్‌స్టా చరిత్రలో ఇదే తొలిసారి

Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 1 విడుదల తరువాత సంచలనం రేపితే..పుష్ప 2 విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2023, 10:27 PM IST
Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2కు అరుదైన రికార్డు, ఇన్‌స్టా చరిత్రలో ఇదే తొలిసారి

Pushpa 2: తగ్గేదే లే అంటూ పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి మేనియా సృష్టించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాకు సీక్వెల్ పుష్ప 2 ఇప్పుడు మరోసారి సంచలనం కల్గిస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప 2 కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పుష్ప 2 సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ  ఫస్ట్ లుక్‌కు భారీగా లైక్స్ వచ్చి పడుతున్నాయి..  తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆచరించే గంగమ్మ జాతరలో పురుషులు మహిళలుగా ముస్తాబవుతుంటారు. అలా జాతరలో ఆడవేషం వేసిన అల్లు అర్జున్ పిక్‌ను ఫస్ట్ లుక్‌గా సుకుమార్ విడుదల చేయగానే అద్భతంగా స్పందన లభిస్తోంది. ఇప్పుడే 7 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భారతీయ సినిమాకు ఇంత పెద్దఎత్తున లైక్స్ రావడం ఇదే తొలిసారి. 

పుష్ప 2 గురించి ఇప్పటికే రెండు అప్‌డేట్స్ వచ్చాయి. అందులో ఒకటి పుష్ప ది రూల్ టీజర్. ది హంట్ బిఫోర్ ది రూల్ టైటిల్‌తో వచ్చిన టీజర్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. తిరుపతి జైళ్లోంచి 8 బుల్లెట్ గాయలతో తప్పించుకున్న పుష్పను వెతికే పోలీసులతో టీజర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా అమ్మవారి అవతారంలో ఉన్న అల్లు అర్జున్ చేతిలో గన్‌తో ఫస్ట్ లుక్ అదరగొడుతోంది. ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ భారతీయ సినిమాకు ఇంత పెద్దఎత్తున లైక్స్ రాకపోవడంతో ఆల్ టైమ్ నేషనల్ రికార్డ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. 

ఇక నెగెటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. పుష్ప 1 వచ్చి రెండేళ్లవుతున్నా..పుష్ప 2 గురించి అతీ గతీ లేదు..సినిమా తీస్తున్నారా లేక ప్రాంక్ చేస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

Also read: Tiger Nageshwararao: రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News