Pakka Commercial OTT: అప్పుడే ఓటీటీలోకి 'పక్కా కమర్షియల్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎందులోనో తెలుసా?

Gopichands Pakka Commercial Movie to Release August 5th on Aha. జూలై 1న  విడుద‌లైన పక్కా కమర్షియల్‌ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 31, 2022, 01:06 PM IST
  • అప్పుడే ఓటీటీలోకి పక్కా కమర్షియల్
  • స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎందులోనో తెలుసా?
  • ఆనందం వ్యక్తం చేస్తున్న ఫాన్స్
Pakka Commercial OTT: అప్పుడే ఓటీటీలోకి 'పక్కా కమర్షియల్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎందులోనో తెలుసా?

Gopichands Pakka Commercial Movie to Streming from August 5th on Aha: మ్యాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్‌'. గ్లామర్ డాల్ రాశీ ఖన్నా కథానాయికగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా కమర్షియల్‌ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మారుతి మార్క్ లేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. 

జూలై 1న  విడుద‌లైన పక్కా కమర్షియల్‌ చిత్రం అప్పుడే ఓటీటీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'లో ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సంస్థ ట్విటర్‌లో ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దాంతో థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయిన వారు ఆహాలో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చు. ఆగస్టు 5నే మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'నెట్‌ఫ్లిక్స్‌'లోనూ పక్కా కమర్షియల్‌ సినిమా విడుదల కానుందని సమాచారం తెలుస్తోంది.

థియేట‌ర్‌లో విడుద‌లైన నాలుగు వారాల త‌ర్వాత పక్కా కమర్షియల్‌ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. దాంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్‌, రాశీ ఖన్నా లాయర్లుగా నటించారు. సత్యరాజ్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరుస ఫ్లాప్‌ల‌తో సతమతమవుతున్న గోపీచంద్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నా.. అడియాశలే అయ్యాయి. ప్రస్తుతం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాచో స్టార్ ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’ లాంటి హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. 

Also Read: Earthquake: ఖాట్మండులో భూకంపం.. బీహార్ లోనూ ప్రకంపనలు.. వణికిన జనాలు   

Also Read: కులాల కుంపటి.. సొంత సినిమా ఈవెంట్ కే రాలేని పరిస్థితుల్లో నితిన్ డైరెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News