OTT Movies: ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటే

OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2024, 11:11 AM IST
OTT Movies: ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటే

OTT Movies: గత 3-4 నాలుగేళ్లుగా సినీ పరిశ్రమ ట్రెండ్ మారింది. ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది. పెద్ద సినిమాలయితే థియేటర్‌లో విడుదలైన నెల లేదా నెలన్నరకు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ విడుదల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏమున్నాయో చూద్దాం

ప్రస్తుతం థియేటర్లలో నాని నటించిన సరిపోదా శనివారం, విజయ్ నటించిన గోట్ మాత్రమే ఉన్నాయి. ఇక ఓటీటీల్లో అయితే చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నిన్నటి నుంచి వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇలా ఉంది

అమెజాన్ ప్రైమ్

సెప్టెంబర్ 4 నుంచి రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్
సెప్టెంబర్ 5 నుంచి హౌస్ కీపింగ్, భగవాన్ దాసంతే రామరాజ్యం
సెప్టెంబర్ 6 నుంచి కాల్ మి బే, సింబా తెలుగు

ఆహా

సెప్టెంబర్ 5 నుంచి భార్గవి నిలయం, వాస్కోడగామా
సెప్టెంబర్ 6 నుంచి సింబా

నెట్‌ఫ్లిక్స్

సెప్టెంబర్ 5 నుంచి ది పర్‌ఫెక్ట్ కపుల్ వెబ్‌సిరీస్, అపోల్లో 13 సర్వైవల్ డాక్యుమెంటరీ
సెప్టెంబర్ 6 నుంచి బ్యాడ్ బాయ్స్ ఇంగ్లీషు సినిమా, అడియోస్ అమిగో మలయాళం సినిమా, రెబల్ రిడ్జ్ ఇంగ్లీషు సినిమా
సెప్టెంబర్ 13 నుంచి సెక్టార్ 36 హిందీ సినిమా

సోనీలివ్

సెప్టెంబర్ 6 నుంచి తనావ్ సీజన్ 2 హిందీ వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 10 నుంచి తలవన్ మలయాళం సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

సెప్టెంబర్ 3 నుంచి ఇంగ్లీషు టీచర్
సెప్టెంబర్ 4 నుంచి టెల్ మి లైస్ సీజన్ 2 వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 6 నుంచి కిల్ హిందీ సినిమా

జియో సినిమా

సెప్టెంబర్ 3 నుంచి ది ఫాల్ గయ్ ఇంగ్లీషు సినిమా
సెప్టెంబర్ 6 నుంచి ఫైట్ నైట్, ఇమ్మాక్యులేట్ ఇంగ్లీషు హారర్ సినిమా

Also read: Submerged Bikes & Cars: విజయవాడలో వాహన మెకానిక్‌లకు భారీ డిమాండ్, ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News