Devara Movie: రిలీజ్ కాక‌ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న 'దేవ‌ర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Devara Movie: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ వచ్చింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 10:56 AM IST
Devara Movie: రిలీజ్ కాక‌ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న 'దేవ‌ర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Devara Movie Ott Partner confirmed: విడుదల కాకుండానే యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్న దేవర(Devara) సంచలనాలు సృష్టిస్తోంది. ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాకుండానే ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ మెుత్తానికి కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ దిగ్గజం. నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. 'దేవర విలన్‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ”అస‌లైన యోధుడికోసం సిద్ధంగా ఉండండి. దేవర సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంత‌రం త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది' అంటూ రాసుకొచ్చింది.  అంతేకాకుండా #నెట్‌ఫ్లిక్స్ పండ‌గా(NetflixPandaga) అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించింది.

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రానికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తారక్ జోడిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ తదితరుల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది.  ఇది రెండు పార్టులుగా రాబోతుంది. తొలి భాగాన్ని ఈఏడాది ఏప్రిల్ రిలీజ్ చేయనున్నారు. 

Also Read: Raja Saab: రాజా సాబ్ గా రాబోతున్న ప్రభాస్.. లుంగీ లుక్ తో అదరగొట్టిన డార్లింగ్

Also Read: Pushpa 2: పుష్ప2లో సమంత…మరో హీరోయిన్ వద్దంటున్న బన్నీ ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News