Rang De Movie: సమ్మర్‌లోనే నితిన్ మూవీ.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) గతేడాది ‘బీష్మ’ మూవీతో హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్.. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు.

Last Updated : Jan 1, 2021, 05:46 PM IST
Rang De Movie: సమ్మర్‌లోనే నితిన్ మూవీ.. డేట్ ఫిక్స్

Rang De Movie release date locked | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) గతేడాది ‘బీష్మ’ మూవీతో హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్.. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ (Rang De Movie ) సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే అంతకుముందు రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు అభిమానుల మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ క్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మూవీ మేకర్స్ రంగ్ దే సినిమా విడుదల డేట్‌ను ఫిక్స్ చేశారు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ.. టాలీవుడ్‌ (Tollywood) లో చాలా సినిమాలు పోటీ పడుతుండటంతో వేసవి కాలంలోనే రంగ్ దే మూవీని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. Also Read: Ravi Teja: దుమ్ములేపుతున్న క్రాక్ మూవీ ట్రైలర్

రంగ్ దే సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. 

Also Read: Nidhhi Agerwal: బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News