Saagu: అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రానున్న సాగు.. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అంటోన్న నిహారిక

Saagu Movie: బుల్లితెర పైన వెండితెర పైన తన నటనతో మెప్పించిన నిహారిక కొణిదెల…ప్రస్తుతం నిర్మాణం వైపు కూడా తన దృష్టి తిప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారిక సమర్పించిన సాగు చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 29, 2024, 09:12 PM IST
Saagu: అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రానున్న సాగు.. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అంటోన్న నిహారిక

Niharika Konidela: ప్రేమకథా చిత్రాలు వైవిధ్యమైన కథతో వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు అదే ఫార్మేట్ ఫాలో అవుతూ రాబోతున్న ఇండిపెండెంట్ ఫిలిం సాగు. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం టీజర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాని డా. యశస్వి వంగా నిర్మించారు. సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. 

ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని  ఎదురిస్తుంది, ఓడిస్తుంది అనే కథతో ఈ సినిమా సాగుతుంది. హరిబాబు.. సుబ్బలక్ష్మి అనే జంట ఎదుర్కొన్న అడ్డంకులు ఏమిటి.. వాళ్ల ఆశలు ఆశయాలు ఏమిటి.. వాళ్లకు ఎంతో ఇష్టమైన బీడు భూమిని వాళ్లు పోరాడి తెచ్చుకుంటారా లేదా... అందుకోసం వాళ్లు పడిన కష్టాలు ఏమిటి అనే కథతో సాగే సినిమానే ‘సాగు’.

ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా,  జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్,అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ,  టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, వి.ఐ,  ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో  మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా సమర్పకురాలునిహారిక మాట్లాడుతూ.. ‘సాగు అనే సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. జీవితంలో మనం ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటూ ఉంటాము. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయధారులకు ఎంతో హోప్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో షూట్ చేశారుచిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్‌కు చాలా థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరికి ముందు తీసుకు రావడం ఆనందంగా ఉంది. అందుకే సాగు సినిమాను నేను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలను నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలి’ అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత ఈ సినిమాలో నటించిన వంశీ మాట్లాడుతూ.. ‘సాగు అనేది మా అందరికీ ఎంతో ప్రత్యేకమైన సినిమా. గత ఆరేడేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. నిహారిక గారి వల్లే మా సాగు సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్’ అని తెలియజేశారు.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News