Miss Shetty Mr Polishetty: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలోకి 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'.. స్ట్రీమింగ్‌ డేట్ ఇదే..

Miss Shetty Mr Polishetty: నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను రిలీజ్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2023, 02:25 PM IST
Miss Shetty Mr Polishetty: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలోకి 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'..  స్ట్రీమింగ్‌ డేట్ ఇదే..

Miss Shetty Mr Polishetty OTT Release date: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి లేటేస్ట్ మూవీ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది అనుష్కా శెట్టి. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్‌ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో పోటీపడి మరి భారీ వసూళ్లు సాధించింది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా సాధించింది. ఇందులో అనుష్క, నవీన్‌ల జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు కామెడీతోనే ఆకట్టుకున్న నవీన్ శెట్టి.. ఈ సినిమాలో మాత్రం తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. 

ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అక్టోబరు 05 నుంచి తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో పవిత్ర లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి  రధన్, గోపీసుందర్ సంగీతం అందించారు. నిరవ్ షా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. థియేటర్లలో ఈ సూపర్ హిట్ మూవీని మిస్ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read: Bigg Boss 4th Housemate : నాలుగో హౌస్‍మేట్‍గా రైతు బిడ్డ.. ముఖం మాడ్చుకున్న సీరియల్ బ్యాచ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News