Aay: నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఎంగేజ్ చేస్తోంది.. థీమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు..

Aay: తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రెస్టిజియస్ సంస్థ  GA2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా నటించారు.తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 20, 2024, 05:30 AM IST
Aay:  నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఎంగేజ్ చేస్తోంది.. థీమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు..

Aay: అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణలో అంజి కె.మ‌ణిపుత్ర‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆయ్’.  ఈ సినిమాతో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ  అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఫ్రైడే రోజున ఈ సినిమా థీమ్ సాంగ్ ను విడుదల చేసారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ..
‘ఆయ్’ అని టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అని అనుకున్నాము. దాని కోసం రక రకాల వేరియేషన్స్‌లోఈ సినిమా టైటిల్ అనుకున్నాము. కానీ ఫిదా టైటిల్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఈ కథను ఒప్పుకున్న నితిన్ కి థాంక్స్ చెప్పారు. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని నితిన్ అన్నారు. ఈ సినిమా రషెస్ బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్ కి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుందన్నారు. నితిన్ ఈ చిత్రంలో ఎంతో ఈజ్‌తో నటించాడు. కొ

నార్నే నితిన్ మాట్లాడుతూ..

‘మేం మంచి గోదావరి సినిమాను తీశాం. మంచి స్నేహం గురించి చెప్పాం. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. ఇంత మంచి చిత్రంలోకి నన్ను తీసుకున్న అంజి గారికి, బన్నీ వాస్ గారికి, అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ..

‘నాకు ఎంటర్టైన్, ఫన్ అంటే చాలా ఇష్టం. ఎంత కష్టంలో, ఒత్తిడిలో ఉన్నా కూడా  ఒక జోక్ మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయని గ్యారంటీగా చెబుతున్నాము. పొట్ట కూడా నొప్పి పుడుతుంది. అంజి నాకు రెండు గంటలు కథను చెబుతూనే సినిమాను చూపించాడు. ఈ సినిమా ఆద్యంతం నవ్వుకునేలా తీర్చిదిద్దిన విషయాన్ని ప్రస్తావించారు.
 
దర్శకుడు అంజి కె.మ‌ణిపుత్ర‌ మాట్లాడుతూ..

‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రంగా ‘ఆయ్’ నిలవడం ఖాయం. నితిన్ నార్నే ఎంతో నాచురల్ గా  నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించిన విషయాన్ని ప్రస్తాంచారు.

GA2 పిక్చర్స్:
మెగా  ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ నిర్మాత బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌ నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. .
 
సాంకేతిక వర్గం:బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల అందించారు. ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న, పి.ఆర్.ఒ - వంశీ కాకా, మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ - అనిల్, భాను

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News