Narne Nithiin - AAY: వెరైటీ టైటిల్‌తో పలకరించబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్.

Narne Nithiin - AAY: నార్నే నితిన్.. ఎన్టీఆర్ బామ్మర్దిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ 'మ్యాడ్' సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2024, 12:22 PM IST
Narne Nithiin - AAY: వెరైటీ టైటిల్‌తో పలకరించబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్.

Narne Nithiin - AAY: నార్నే నితిన్ గతేడాది 'మ్యాడ్' మూవీతో జబర్ధస్త్ హిట్ అందుకున్నారు. ఎన్టీఆర్ బామ్మర్ధిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఇక మ్యాడ్ సినిమాలో సీరియస్‌ యాక్షన్‌తో ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా ఈయన మరో సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన నయన్ సారిక జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఆయ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.  GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా తెరకెక్కుతుఓంది. పూర్తి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుబోతున్న ఈ సినిమా టైటిల్‌ వినూత్నంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తోన్న GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9గా ‘ఆయ్’ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీటైంది.  ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.  

ప్రస్తుతం 'ఆయ్‌' మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరగుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్, కథానాయకుడు నార్నే నితిన్, కథానాయిక నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను సరికొత్తగా ప్రకటించడం విశేషం.  వినూత్నంగా ప్రకటించటం విశేషం.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా కోసం నటీనటులు పనిచేశారు.ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మార్చి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
 
GA2 పిక్చర్స్: గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్..
మమెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ఇపుడు రాబోయే 'ఆయ్' చిత్రం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
 
నటీనటులు:  నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు
 బ్యానర్ - GA2 పిక్చర్స్
సమర్పణ - అల్లు అరవింద్
నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ - అంజి కంచిపల్లి
సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి
సంగీతం - రామ్ మిర్యాల
ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ - వంశీ కాకా
మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ - అనిల్, భాను

Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News