Akhanda OTT Release: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత 2021 డిసెంబరులో విడుదలైన 'అఖండ', 'పుష్ప' చిత్రాలు బాక్సాఫీసు ఎదుట ఊహించని రికార్డులు సృష్టించాయి. అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు ఈ సినిమాలు బాసటగా నిలిచాయి. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాల డిజిటల్ ప్రసారమయ్యి (ఓటీటీ రిలీజ్) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతున్నాయి.
అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్కానున్నాయని ప్రచారం సాగింది. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసింది. 'పుష్ప ది రైజ్' చిత్రాన్ని జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 'పుష్ప' సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్లు పేర్కొంది.
డిసెంబరు 17న థియేటర్లలో రిలీజైన 'పుష్ప' చిత్రం ఓటీటీలో అలరించేదుకు సిద్ధమవ్వగా.. అయితే ఈ మూవీ కంటే ముందుగా విడుదలైన 'అఖండ' సినిమా ఎప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ జోరుగా చర్చిస్తున్నారు. బాలయ్య 'అఖండ'ను డిస్నీ+హాట్ స్టార్ విడుదల చేయనుందన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు.. ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.
అఖండ తెలుగు చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది? అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. హాట్ స్టార్ రిప్లై ఇచ్చింది. 2022 జనవరి 21న ప్రీమియర్‌లో స్ట్రీమ్ కానుందని తెలిపింది. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే జనవరి 21న 'అఖండ' ఓటీటీ రిలీజ్ అని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Hi there! Akhanda will premier on 21st Jan, 2022. Kindly stay tuned for more updates.
— Disney+HS_helps (@hotstar_helps) January 5, 2022
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం 'అఖండ'. అఘోరా, మురళీకృష్ణ పాత్రల్లో బాలకృష్ణ విశేషంగా ఆకట్టుకున్నారు. నాయికగా ప్రజ్ఞా జైస్వాల్, ప్రతినాయకుడిగా శ్రీకాంత్ అలరించారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.
Also Read: ఈ ఫొటోలలో ఉన్న సొట్టబుగ్గల సుందరిని మీరు గుర్తుపట్టారా?
Also Read: Harnaaz Sandhu NYC Apartment: న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు ఇల్లు చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.