వర్మ చిత్రంలో పోలీస్‌గా నాగ్

  

Last Updated : Nov 4, 2017, 03:15 PM IST
వర్మ చిత్రంలో పోలీస్‌గా నాగ్

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ట్విటర్ ద్వారా స్పందించారు నాగ్. నవంబరు 20న హైదరాబాద్‌లో ప్రారంభమవబోతున్న ఈ చిత్రంలో తాను పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఇది పూర్తిగా వర్మ స్టైల్‌లో వచ్చే యాక్షన్ చిత్రమట. "మన కాంబినేషన్‌లో మళ్లీ సినిమా వస్తుందని తెలిసి అభిమానులు కొందరు షాక్ గురవుతున్నారు... కొందరు ఆనందిస్తున్నారు. మరి మనం అదరగొట్టాలి రామూ.." అన్న నాగ్ ట్వీట్‌కు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. "ఈ సారి నేను మాట్లాడను. నా సినిమా మాట్లాడేలా చేస్తాను" అని తెలిపారు. పోలీస్ పాత్రలు చేయడం నాగార్జునకు కొత్తేమీ కాదు. గతంలో కూడా రక్షణ, నిర్ణయం, శివమణి, గగనం చిత్రాల్లో నాగ్ పోలీస్ పాత్రలలో నటించారు. అలాగే ఈ చిత్రంలో ఆయన  సరసన టబు నటిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన "శివ" ఎలా చరిత్రను తిరగరాసిందో తెలియంది కాదు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో అంతం, గోవిందా గోవిందా లాంటి చిత్రాలు కూడా తెరకెక్కాయి. 

 

 

 

Trending News