Sankranthi Releases 2024: సంక్రాంతి అంటేనే సినిమాల సంబరం. సినిమా కంటెంట్ ప్రేక్షకులను మెప్పించగలిగితే పండుగ సీజన్ లో వచ్చినంత వసూళ్లు మిగతా రోజుల్లో రావు. అందుకే అగ్ర హీరోలు సంక్రాంతి కోసం రెడీగా ఉంటారు. సీనియర్ హీరోస్ అందరిలో కన్నా నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కాస్త జాస్తి అని అనవచ్చు. అయితే ఏకంగా తన సెంటిమెంట్ కోసం నాగార్జున ఎంత రిస్క్ తీసుకున్నారో తెలుసా..
నా సామి రంగ చిత్రం సంక్రాంతి బరిలోకి దింపడానికి కేవలం 70 వర్కింగ్ డేస్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయించాడు నాగార్జున. అంతేకాదు ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో థియారిటికల్ రైట్స్ ని స్వయంగా తానే కొనేశాడు. దగ్గర ఉండి మరి ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ఫ్యాన్సీ రేట్ కి తీసుకునేలా డీల్ చేయించారు. ఇదంతా ఎందుకు అంటే..సంక్రాంతికి తన మూవీని ఎలాగైనా థియేటర్లలోకి దింపాలి అన్నది నాగార్జున పట్టుదల. అంతకుమించి సినిమా కంటెంట్ పై అతనికి ఉన్న నమ్మకం వల్ల కూడా ఇలా జరగిఉండొచ్చు. రికార్డ్ స్థాయిలో 70 రోజుల్లో ఈ చిత్రం పూర్తి కావడానికి నాగార్జున పట్టుదలే కారణం.
కాగా మొదట్లో ఈ సినిమాకి కొన్ని సమస్యలు కూడా ఏర్పడ్డాయి. పోరింజు మరియం జోస్ అనే మలయాళం చిత్రం మూవీ తో బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్టర్ గా పరిచయం చేయడానికి రంగం మొత్తం సిద్ధం చేశారు. ఆ తర్వాత ఒప్పందాల సమయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. అంతేకాకుండా ప్రసన్న ఒక్కడే ఈ మూవీ బరువు మోయలేడు అన్న అనుమానంతో మూవీ షూటింగ్ నెలల తరబడి ఆగిపోయింది. చివరి నిమిషం వరకు మెగా ఫోన్ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ పట్టుకుంటాడు అని ఎవరు ఊహించలేదు. డబ్ల్యూ మూవీ తోటే విజయ్ బిన్నీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సైతం ఆశ్చర్యపోయే విధంగా నా సామిరంగా చిత్రాన్ని వేగంగా పూర్తి చేశాడు.
ఇక్కడి వరకు అంతా బాగుంది కానీ అసలు కథ ముందుంది. ఇంత పంతం పట్టి, పరుగులు పెట్టించి పూర్తి చేసిన సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. ఇప్పటికే పండగ బరిలో అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి. అవి చాలావని రెండు తమిళ చిత్రాలు థియేటర్ల కోసం తంటాలు పడుతున్నాయి. గుంటూరు కారం ,హనుమాన్, సైంధవ్ ..ఈ మూడు చిత్రాల్లో కచ్చితంగా ఒకటో రెండో నాగార్జున చిత్రాన్ని డామినేట్ చేయడం కన్ఫామ్. పక్కా పల్లెటూరి వాతావరణంతో.. పండగ నేపథ్యంలో సాలిడ్ కంటెంట్ మూవీ తీశాము అన్న కాన్ఫిడెన్స్ తో నాగార్జున టీం కనిపిస్తోంది. ఇక రెండు రోజుల్లో మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తవుతాయి. మూవీ సక్సెస్ విషయాన్ని కన్నా అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. ఏ ధైర్యంతో నాగార్జున ఇంత స్పీడుగా ఈ మూవీ ని తీశాడు? మరి సినిమా రిజల్ట్ తెలిసేంతవరకు ఇది బేతాళ ప్రశ్న గానే మిగులుతుందేమో.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter