Naga Chaitanya: నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను.. సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య!!

నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు నేను చెయ్యలేను అని తాజాగా నాగ చైతన్య ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఇన్ డైరెక్ట్‌గా సమంతను ఉద్దేశించే నాగ చైతన్య ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 05:24 PM IST
  • సమంతపై నాగ చైతన్య పరోక్ష వ్యాఖ్యలు
  • సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య
  • నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను
Naga Chaitanya: నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను.. సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య!!

Naga Chaitanya Indirect Comments about Samantha: ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న టాలీవుడ్ స్టార్లు సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయి దాదాపుగా రెండు నెలలు కావొస్తున్నా.. ఎక్కడ విన్నా, చూసినా జనాలు ఇదే టాపిక్ చర్చిస్తున్నారు. ఎందుకంటే సామ్-చై తాము ఎందుకు విడిపోయామ‌నే సంగ‌తిని చెప్ప‌లేదు. ఈ జంట విడిపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే విడాకుల గురించి సామ్ తన అభిప్రాయాన్ని చెప్పగా.. చై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ చైతన్య మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

తాజాగా నాగ చైతన్య (Naga Chaitanya) ఇంట‌ర్వ్యూలో పాల్గొనగా.. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి చైని పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు అని అడగ్గా... 'అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే నేను చేసే సినిమా అయినా, పోషించే పాత్ర అయినా మా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించకూడదు. మా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను. నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు నేను చెయ్యలేను. ఇది నేను పెట్టుకున్న రూల్' అని సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇన్ డైరెక్ట్‌గా సమంత (Samantha)ను ఉద్దేశించే నాగ చైతన్య ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు. 

Also Read: శృంగారం కోసం బలవంతపెట్టినందుకు... భర్త మర్మాంగం కోసేసిన భార్య...

ఈ ఏడాది 'లవ్ స్టోరి' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య (Naga Chaitanya).. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చిత్రం పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం నాగార్జున‌తో క‌లిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఓ హారర్ వెబ్ సిరీస్ చేయడానికి చై సిద్ధమవుతున్నారు. ఇక విడాకుల అనంతరం సామ్ (Samantha) స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల ఓ హాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల పుష్ప సినిమా (Pushpa Movie)లో స్పెషల్ సాంగ్‌ చేశారు. 

Also Read: KTR - VVS Laxman: కంగ్రాట్స్ బ్రదర్‌.. హైదరాబాద్ సొగసరికి అభినందనలు చెప్పిన కేటీఆర్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News