Balakrishna Akkineni thokkineni : అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై నాగ చైతన్య కౌంటర్.. బాలయ్యకు దిమ్మతిరిగేలా పోస్ట్

Balakrishna Akkineni thokkineni వీర సింహా రెడ్డి సక్సెస్ ఈవెంట్లో బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి. అక్కినేని, తొక్కినేని అంటూ పిచ్చి పిచ్చిగా బాలయ్య వాగేశాడు. దీంతో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 02:18 PM IST
  • బాలయ్య అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలు
  • ఖండించిన అక్కినేని అభిమాన సంఘాలు
  • నాగ చైతన్య, అఖిల్ పోస్టులు వైరల్
Balakrishna Akkineni thokkineni : అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై నాగ చైతన్య కౌంటర్.. బాలయ్యకు దిమ్మతిరిగేలా పోస్ట్

Naga Chaitanya Counters on Nandamuri Balakrishna నందమూరి బాలకృష్ణ ఆదివారం నాడు జరిగిన వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో అక్కినేని, తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు దుమారం రేగుతోంది. అక్కినేని అభిమాన సంఘాలు బాలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక తాజాగా అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్‌లు స్పందించారు. బాలయ్యకు కౌంటర్లు వేసినట్టుగా పోస్టులు చేశారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అంటూ నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

 

మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని అభిమాన సంఘం డిమాండ్ చేసింది. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  సర్వేశ్వరరావు ఒక లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా అక్కినేని వారసులు స్పందించడంతో ఈ వివాదం మరింతగా రాజుకునేలా ఉంది.

అసలు ఈ వివాదం మీద కింగ్ నాగార్జున రియాక్ట్ అవుతాడా? ఇకపై నందమూరి, అక్కినేని మధ్య మరింత గ్యాప్ ఏర్పడుతుందా? అన్నది చూడాలి. అయితే చై, అఖిల్‌లు మాత్రం బాలయ్యను తిట్టకుండానే తలదించుకునేలా పోస్ట్ చేశారు. ఈ ఇద్దరూ గొప్పవాళ్లు.. ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వాళ్లు.. వాళ్లని అవమానించడం అంటే మనల్ని మనమే అవమానించుకున్నట్టు అని ఎంతో హుందాగా స్పందించారు.

అయితే ఈ వివాదం ఇలా చెలరేగుతోండగానే.. నాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఉన్న విబేధాలు తెలిసి వచ్చేలా నాటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రెండో సారి ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినీ ఇండస్ట్రీ నుంచి అధికారికంగా మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లి మాట్లాడేందుకు ఏఎన్నార్ ఒప్పుకోలేదట. రానని చెప్పమన్నాడు.. కోపంగా ఉన్నాడని చెప్పమన్నాడు అంటూ ఎన్టీఆర్ గురించి ఏఎన్నార్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
 

Also Read:  Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News