Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

Naga Chaitanya on 13 Years For Ye Maaya Chesave సమంత నాగచైతన్యలు మొదటగా కలిసి నటించిన సినిమా ఏ మాయ చేశావే. ఈ సినిమాతోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆదే ప్రేమగా మారింది. పెళ్లికి దారి తీసింది. చివరకు విడాకులతో బంధం ముగిసిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 08:45 AM IST
  • నెట్టింట్లో హాట్ టాపిక్‌గా చై సామ్ వ్యవహారం
  • పదమూడేళ్ల ఏ మాయ చేశావేపై పోస్టులు
  • చైతూ పోస్టర్‌ను షేర్ చేయని సమంత
Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

Naga Chaitanya - Samantha సమంత, నాగ చైతన్యలు విడాకుల తరువాత చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. విడాకులు ఎందుకు అయ్యాయ్ అనే దానిపై ఎవ్వరికీ ఏ క్లారిటీ లేదు. కానీ విడాకులు తీసుకున్న తరువాత సమంత, చైతూల ప్రవర్తనలు మాత్రం చాలా వింతగా ఉన్నాయి. చైతూ అంటే విపరీతమైన ద్వేషం, కోపం ఉన్నట్టుగా సమంత పరోక్షంగా చెప్పకనే చెప్పేస్తోంది. కానీ సమంత గురించి మాత్రం చై ప్రేమగానే చెబుతూ ఉన్నాడు. మీ ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా? అని చైతూని అడిగితే.. అది జరిగితే నిజంగానే క్రేజీగా ఉంటుందని అన్నాడు.

అయితే చైతూ గురించి సమంత వద్ద ప్రశ్నిస్తే చాలు వెంటనే సీరియస్ అయినట్టుగా లుక్ ఇచ్చేస్తోంది సమంత. కరణ్ జోహార్ ఏదో మాటల్లో నీ భర్త అని అంటే.. నా భర్త కాదు.. మాజీ భర్త అని కౌంటర్ వేసింది. అంతే కాకుండా తమ ఇద్దరినీ ఒకే గదిలో పెడితే.. దగ్గర్లో కత్తుల్లాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అని అనేసింది. అంటే పొడుచుకుని చంపుకునేంత కోపం ఉందా? అనే అనుమానం కలిగించేలా సమంత మాటలు వదిలింది.

ఎంత ద్వేషం ఉన్నా కూడా సమంత తన సినిమా కెరీర్‌ను, పర్సనల్ కెరీర్‌ను వేరు చేసి చూస్తుందని అనుకున్నారు. కానీ ఏ మాయ చేశావే సినిమా పోస్టర్‌ను కూడా షేర్ చేయకుండా.. తన ఫోటోలను మాత్రమే షేర్ చేసుకుంది. ఎక్కడా నాగ చైతన్య ఫోటో కనిపించుకుండా జాగ్రత్త పడింది. అదే చైతూ అయితే సమంతతో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశాడు. 

సమంతకు, చైతూకి ఉన్న తేడా అదే అని అర్థం అవుతోంది. అయితే సమంత ఎంత కోపం, ద్వేషంతో ఉందో ఈ విషయంతోనే తెలిసిపోతోంది. చైతూ ఉన్న పోస్టర్‌ను సైతం సమంత షేర్ చేసేందుకు ఇష్టపడటం లేదనిపిస్తోంది. లోలోపల ఏం జరిగిందో తెలియడం లేదు గానీ చైతూ అంటే మాత్రం సమంత ఇంత కోపం ఉందా? ద్వేషం ఉందా? అని జనాలు అనుకుంటున్నారు.

సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇన్ని నెలలు మయోసైటిస్ అంటూ బాధపడుతూ ఉంది. దాని వల్ల సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో మళ్లీ తిరిగి తన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చేసింది. ఈ క్రమంలో రాజ్ అండ్ డీకే సిటాడెల్, శివ నిర్వాణ ఖుషి సినిమాలను పూర్తి చేసేందుకు రెడీ అయింది.

Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత

Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News