Naveen Yerneni hospitalised: వరుస ఐటీ రైడ్స్.. మైత్రీ నవీన్ కు అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!

Mythri Naveen Yerneni Hospitalised in Hyderabad: టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న క్రమంలో నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 21, 2023, 06:54 PM IST
Naveen Yerneni hospitalised: వరుస ఐటీ రైడ్స్.. మైత్రీ నవీన్ కు అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!

Naveen Yerneni Hospitalised: టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద సుకుమార్ నివాసం మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ స్థాపించిన కొద్ది సంవత్సరాల లోనే బడా హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. ఈ నేపథ్యంలో సహజంగానే అందరి దృష్టితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటి అధికారులు దృష్టి కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల నుంచి వారి ఇళ్లలో, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయనకు అస్వస్థత ఏర్పడిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన వారి నివాసానికి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కి తరలించారు అని తెలుస్తోంది. ఆయనకు హైబీపీ రావడంతో అస్వస్థతకు గురయ్యారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలుస్తోంది. ఇక ఇప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ నిర్మాతల నివాసాలు, పుష్ప సినిమాలో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ నివాసం మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. సుకుమార్ ఆఫీసులో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Brahmanandam: నిధులు మింగేసి వడ్డీలకు తిప్పిన బ్రహ్మానందం.. కలకలం రేపిన కాంట్రవర్సీ గురించి తెలుసా?

ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడంతో వాటికి సంబంధించిన పనులు చెల్లింపులు వ్యవహారం వాటి అవకతవకలకు, సంబంధించిన ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వరుస ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఎర్నేని నవీన్ ఆందోళనకు గురై హైబీపీ తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.

నిజానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థను 2015 సంవత్సరంలో ముగ్గురు స్నేహితులు కలిసి ప్రారంభించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసి సినిమా మీద ఫ్యాషన్ తో హైదరాబాదులో అడుగుపెట్టిన ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ కలిసి ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించగా ప్రస్తుతానికి చెరుకూరి మోహన్ నిర్మాణ సంస్థ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే రవిశంకర్, నవీన్ మాత్రం కలిసి సినిమాలు చేస్తూ వరుస హిట్లందుకుంటూ దూసుకు వెళుతున్నారు.

నిర్మాణ సంస్థ ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలైనా దాదాపుగా బడా హీరోలు అందరినీ కవర్ చేసిన సంస్థగా ఈ సంస్థకు పేరుంది. ఇక ఈ నిర్మాణ సంస్థకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఎమ్మెల్యే, తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే ఫైనాన్షియర్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వారి ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ నిధులు వచ్చాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు రోజుల తరబడి రైడ్స్ జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు ఐడి అధికారుల నుంచి కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అందలేదు.

Also Read: Virupaksha Movie Review: హారర్ థ్రిల్లర్ 'విరూపాక్ష' ఎలా ఉందో రివ్యూలో చూసేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News