Mohan Babu ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ( Mohan Babu ) క‌థానాయ‌కుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా 500లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన రీతిలో పేరును సంపాదించుకున్నారు.

Last Updated : Oct 23, 2020, 04:56 PM IST
Mohan Babu ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం

son of india movie shooting starts: టాలీవుడ్ (Tollywood) సినీయర్ హీరో, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ( Mohan Babu ) క‌థానాయ‌కుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా 500లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన రీతిలో పేరును సంపాదించుకున్నారు. అటు హీరోతోపాటు ఇటు నిర్మాత‌గా కూడా ఆయన రాణించారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వాతంత్ర్య దినోత్స‌వం ( independence day ) నాడు  తాను చేయ‌బోతున్న ‘‘సన్నాఫ్ ఇండియా’’ ( Son of India ) టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ (Son of India poster ) ను సైతం విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు (Diamond Ratna Babu) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

అయితే తాజాగా ఈ సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ఈ మేరకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా ద్వారా సినిమా షూటింగ్ ప్రారంభమైందని సమాచారమిచ్చారు. శుక్రవారం పూజా కార్య‌క్ర‌మాలతో స‌న్ ఆఫ్ ఇండియా చిత్రం ముహూర్త‌పు షాట్‌ని చిత్రీక‌రించారు. నిర్వాణ, మంచు ల‌క్ష్మీ క్లాప్ కొట్ట‌గా, విరానిక మంచు, ఐరా, అవ్‌రామ్ కెమెరా స్విచాన్ చేశారు. అయితే సన్ ఆఫ్ ఇండియా తొలిషాట్‌కు విష్ణు మంచు దర్శకత్వం వహించారు. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

అయితే ఈ సినిమాను దేశభక్తి, జాతీయత ప్రధానాంశంగా సమాజానికి ఉపయోగ పడే రీతిలో రత్నబాబు తెరకెక్కిస్తుండగా.. ఇళ‌య‌రాజా ( Ilaiyaraaja) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే మునుపెన్నడూ నటించని క్యారెక్టెర్‌లో మోహన్ బాబు నటించనున్నారని తెలిసింది. అయితే  తారాగణం గురించి ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే మోహన్ బాబు చివరిసారి ‘గాయత్రి’ సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత ‘మహానటి’ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో కనిపించారు. Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News