Mohan Babu - Balakrishna: అవును గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టు.. ఏ సినిమా ఎవరు చేయాలన్నది ముందే డిసైడ్ అవుతుందని కొంత మంది విషయాల్లో అది ప్రూవ్ అవుతూనే ఉంది. అలా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీతో మోహన్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు స్టార్ హీరో అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన 'చిత్రం' సినిమా స్టోరీ ముందుగా బాలయ్య దగ్గరకు వచ్చింది. కథ అంతా విన్నాకా.. చివర్లో హీరో పాత్ర ఉరిశిక్ష విధిస్తారనే దానిపై బాలయ్య సందిగ్ధంలో పడ్డారట. హీరో చనిపోయే పాత్ర అయితే.. ప్రేక్షకులు యాక్సెస్ట్ చేయరనే కారణంతో.. ఆ శిక్షను రద్దు చేసేలా కథలో కొన్ని మార్పులు చేర్పులు రచయతలకు చెప్పారట. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో పరుచూరి సోదరులు.. ఈ కథను బాలయ్యకు వినిపించారు. ఆ తర్వాత బాలకృష్ణ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ కథను పక్కనపెట్టారు.
ఆ తర్వాత అదే కథను పరుచూరి సోదరులు మోహన్ బాబుకు వినిపించారు. ఆయన ఇంప్రెస్ అయి.. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'చిత్రం' సినిమా చూసారు. ఆ కథను పట్టుకెళ్లి కే.రాఘవేంద్రరావుకు చెప్పారు. అంతకు ముందే దర్శకేంద్రుడు..మోహన్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అప్పటికే కే.రాఘవేంద్రరావు .. చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే మోహన్ బాబు హీరోగా అంతగా ఫామ్‌లో లేడు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా చేస్తోన్న టైమ్ అది.
ఆ టైమ్‌లో మోహన్ బాబుతో కే.రాఘవేంద్రరావు సినిమా అనగానే సినీ ఇండస్ట్రీలో వద్దన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కానీ కే.రాఘవేంద్రరావు.. మోహన్ బాబు నిర్మాణంలో ఆయనే హీరోగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై 'అల్లుడు గారు' సినిమాను తెరకెక్కించారు. కేవలం 32 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసారు దర్శకేంద్రుడు. శోభన, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 28 సెప్టెంబర్ 1990న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు పలు కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు పరుగును పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు కే.వి.మహదేవన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ రకంగా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీతో మోహన్ బాబు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అల్లుడుగారు తర్వాత మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం వంటి వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోగా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకున్నారు.
Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో విడుదల.. అదిరిపోయే హామీలు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook