Roja on Mahesh Babu: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల పాలిట దైవంలా నిలుస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి ప్రాణాలను నిలిపారు. ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో మహేష్ చేతులు కలిపారు. చిన్నారుల పట్ల మహేష్ దయా హృదయానికి ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీ ఎమ్మెల్యే రోజా మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించారు.
మహేష్‌కు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు ఎమోజీలతో కూడిన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్ బాబుకు హ్యాట్సాఫ్' అని పేర్కొన్నారు. రెయిన్ బో ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి మహేష్ మీడియాతో మాట్లాడిన వీడియోను అందులో షేర్ చేశారు. రోజా ట్వీట్‌పై మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దైవం మహేష్ రూపేనా అంటూ ఆయన ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మహేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్నాయనే చెప్పాలి.
మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ 1200 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఇందుకోసం ఆంధ్రా హాస్పిటల్స్, రెయిన్‌బో హాస్పిటల్స్‌తో కలిసి పనిచేశారు. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో చేతులు కలపడం ద్వారా తొలి విడతలో 125 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించనున్నారు.
కాగా, ప్రతీ వెయ్యి మంది శిశువుల్లో 10 మంది శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. హార్ట్ సర్జరీలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అది తలకు మించిన భారమనే చెప్పాలి. మహేష్ లాంటి వ్యక్తులు ఇలా ఉచిత హార్ట్ సర్జరీలు చేయిస్తుండటంతో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలుస్తున్నాయి.
❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022
Also Read: Russia Ukraine War: నన్ను ప్రాణాలతో చూడటం ఇదే చివరిసారి కావొచ్చు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు..
Also Read: Wife Illicit Affair: బాబాయితో అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook