The Raja Saab: ప్రభాస్ కాదంటే చిరంజీవి.. ది రాజా సాబ్‌పై డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas: చిన్న చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్ సాధించిన దర్శకులలో మారుతి ఒకరు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాలు తీసి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీసే స్థాయికి చేరారు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 09:42 PM IST
The Raja Saab: ప్రభాస్ కాదంటే చిరంజీవి.. ది రాజా సాబ్‌పై డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas-Maruthi: ఈ రోజుల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ మారుతి. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత బస్ స్టాప్ సినిమాతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సైతం మంచి విజయం సాధించింది. చిన్న చిన్నగా బోల్డ్ కంటెంట్ నుంచి అందరికీ నచ్చే సినిమాలు తీయడం ప్రారంభించారు ఈ డైరెక్టర్. ముఖ్యంగా మారుతి హీరో నానితో చేసిన బలే బలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ నమోదు చేసుకుంది..

ఆ తరువాత ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన మహానుభావుడు కూడా అందరిని ఆకట్టుకుంది. అలా చిన్న చిన్నగా పెద్ద డైరెక్టర్ గా మారిన మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సబ్ సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం బాహుబలి తర్వాత ఒక పక్కా కమర్షియల్ డైరెక్టర్ తో తెలుగులో ఒక పక్కా కమర్షియల్ సినిమా ప్రభాస్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు మరోసారి ప్రభాస్ ని డార్లింగ్ గా చూడబోతున్నాము అని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మారుతికి కామెడీ పెట్టింది పేరు. అయినా కామెడీ సినిమాలు బాగా చేయగలుగుతారు. అలాంటి దర్శకుడు చిరంజీవితో సినిమా తీస్తే బాగుండు అని ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వచ్చారు. మరోపక్క నిజంగానే మారుతి చిరంజీవితో ఒక కామెడీ సినిమా చేయబోతున్నారు అని కూడా వార్తలు రాసాగాయి. ఈ నేపథ్యంలో ఇదే ప్రశ్న ఈమధ్య మారుతికి ఎదురయింది.

అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్‌తో చేస్తున్న ‘రాజాసాబ్’  కంటే ముందు చిరుతో ఓ సినిమా చేయాల్సి ఉందట. ప్రభాస్ కన్నా కూడా ముందు చిరంజీవికి ఓ కథ కూడా వినిపించారట. చిరంజీవి వింటేజ్ కామెడీతో ఆ సినిమా కథ ఉంటుందట. మెగాస్టార్ నుంచి కూడా ఆ కథకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఇంతలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాకి ఓకే చెప్పడంతో.. చిరంజీవి సినిమాని పక్కన పెట్టి ప్రభాస్ సినిమాని పట్టాలు ఎక్కించాల్సి వచ్చిందట.  ఒకవేళ ప్రభాస్ కాదని ఉంటే మారుతి ముందుగా చిరంజీవి సినిమానే చేసేవాడట. అయితే ప్రభాస్ సినిమా పూర్తి అయిన తరువాత ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది.

 

చిరంజీవి ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్టత తో ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ చిత్రీకణలో దాదాపు 70 శాతం షూటింగ్ VFX పైనే జరుపుకోనుంది. దీంతో ఈ ఏడాది అంతా చిరంజీవి ఈ మూవీతోనే బిజీగా ఉండొచ్చు ‌.. కాబట్టి చిరు ఈ సినిమా ఫినిష్ చేశాక అలానే మారుతి ప్రభాస్ సినిమా ఫినిష్ చేశాక.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చేలానే కనిపిస్తోంది.

Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News