Manam Saitham: కోమాలో సీనియర్ న‌టుడు.. చేయూతనందించిన మరో నటుడు

Manam Saitham Kadambari Kiran: ఈ మధ్యనే పావలా శ్యామల సమస్యల్లో ఉండి అని తెలుసుకొని మరి అక్కడికి వెళ్లి సహాయం చేశారు కాదంబరి కిరణ్. మనం సైతం ద్వారా ఇలా ఎంతోమందికి సాయం చేయాలి అనేదే ఆయన ఉద్దేశం…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 05:00 AM IST
Manam Saitham: కోమాలో సీనియర్ న‌టుడు.. చేయూతనందించిన మరో నటుడు

Kadambari Kiran: మనం సైతం అని అనడమే కాదు…నిజంగానే సహాయం కోరే వారి కోసం తాను సైతం అంటూ ముందుకు వెళుతున్నారు కాదాంబరి కిరణ్.
ఆయ‌న మాన‌వ‌త్వం గుండె గుండెను తాకుతోంది.. నిస్సాహ‌య‌కుల‌కు ‘మనం సైతం' అంటూ ఆదుకుంటున్నారు. ఈ మధ్యనే పావలా శ్యామల ఆర్థిక సమస్యల్లో ఉంది అని తెలిసి ఆమెకు ఇంటి వద్దకు వెళ్లి మరి సహాయం చేశారు. ఇలా చేస్తూ ఆప‌ద వ‌చ్చిన వారి వ‌ద్ద‌కి ఆయ‌నే వెళ్లి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. 

ఎక్కడైనా సరే ఎవరికైనా సరే.. విపరీతమైన సమస్యలు ఎదుర‌వుతే అక్క‌డ ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. తన వంతు చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం! అంటూ ముందుకు వెళుతున్న ‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు, సినీ నటుడు కాదంబ‌రి కిర‌ణ్. తాజాగా సినీ, టీవీ న‌టుడు డీ. వీర‌భ‌ద్ర‌య్య‌కు ఆర్థిక‌ సాయం చేశారు.

సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ వీరభద్రయ్యకు సహాయం చేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్ర‌మాదానికి గురై ఆందోళ‌న‌క‌రమైన ప‌రిస్థితుల్లో హ‌స్పిట‌ల్‌లో చేరిన సినీ, టీవీ న‌టుడు డీ. వీర‌భ‌ద్ర‌య్య‌కు రూ. 25,000 చెక్కును ఆర్థిక సాయంగా అందించారు. వీర‌భ‌ద్ర‌య్య‌కు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా ఈ ఆర్థిక సాయం చేశారు. అలానే వీరభద్రయ్య వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. డీ. వీర‌భ‌ద్ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటానంటూ వారిలో కొండంత ధైర్యం నింపారు. ఇలా నిరంత‌రం దాతృత్వం కొనసాగిస్తూ ఉండడంతో.. కిరణ్ మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఎన్నో ఏళ్లగా కాదంబరి కిరణ్ సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం' అనే ఫౌండేషన్ స్థాపించారు. పదేళ్లుగా ఈ ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తున్నారు. ఇలానే ఆయన మరిన్ని సంవత్సరాలు కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News