Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..

Mammootty: ఇటీవల చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అమీనా కన్నుమూశారు. ఆమె 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 03:47 PM IST
Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..

Mammootty’s sister Ameena dies: మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అమీనా( Ameena ) తాజాగా కన్నుమూశారు. మమ్ముట్టి సోదరి అమీనా(70) గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో మమ్ముట్టి కుటుంబం మరోసారి తీవ్ర విషాదంలో మునిగింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో మమ్ముట్టి(Mammootty) తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మృతి చెందారు. ఆమె వయసు 93 ఏళ్లు. ఆ బాధ నుంచి తేరుకోకముందే  ఆరు నెలల వ్యవధిలో మమ్ముట్టి సోదరి చనిపోవడం చాలా బాధాకరం. ఫ్యాన్స్, సినీ ప్రముఖలు మమ్ముట్టి సోదరికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె అంత్యక్రియలు రేపు అంటే సెప్టెంబరు 13న జరగనున్నాయి. అమీనా దివంగత పీ.ఎం. సలీమ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారే జిబిన్ సలీం, జూలీ మరియు జూబీ. అమీనా మమ్ముట్టికి చిన్న సోదరి. ఇబ్రహీం కుట్టి, జకరియా పనాపరంబిల్, సౌదా మరియు షఫీనా అమీనా యొక్క ఇతర తోబుట్టువులు. 

మమ్ముట్టి 72 ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.  ఈ నెలలోనే (సెప్టెంబరు 07) మమ్ముట్టి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ మూవీకి భ్ర‌మ‌యుగం (Bramayugam) అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ చిత్రానికి భూతకాలం (Bhoothakaalam 2022) ఫేమ్ రాహుల్ సదాశివన్ (Rahul SadaShivan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 

Also Read: Spirit Movie: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్‌' సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News