Mahesh Babu Interview: మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. ఇదే నా చివరి సినిమా ఏమో!!

Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటూ బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2024, 08:08 PM IST
Mahesh Babu Interview: మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. ఇదే నా చివరి సినిమా ఏమో!!

Mahesh Babu: అతడు, ఖలేజా తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కొనసాగడం లేదు. మిశ్రమ స్పందనతో కేవలం పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు మహేష్ బాబు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంటుంది.

సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ చిత్రం కి నెగటివ్ రెస్పాన్స్ వస్తున్నా కానీ..మహేష్ బాబు అభిమానులకు మాత్రం ఈ చిత్రంలో మహేష్ బాబు చేసిన క్యారెక్టర్  కన్నుల పండగ ఉంది. సాధారణ ప్రేక్షకులు సైతం  మహేష్ బాబు నటనను మెచ్చుకుంటున్నారు. మూవీలోని మహేష్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా మహేష్ బాబు సాంగ్స్ కి వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు నిజంగానే ఈ సినిమాలో త్రివిక్రమ్ కొత్త మహేష్ బాబు ని చూపించారు.

ఇక ఇదే విషయం గురించి మహేష్ బాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..,’సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఈ చిత్రంలో కనీసం ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని. ఎందుకంటే.. ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పటికి వస్తుందో నాకు క్లియర్ గా తెలియదు. ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు. కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకే తప్పకుండా ఈ సినిమాలో డాన్స్ వేద్దాము అని నిర్ణయించుకున్నాను' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేష్ బాబు.

ముందుగా అనుకున్న దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. అంతేకాక నెక్లీస్ గొలుసు సాంగ్ చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఓ రెండు సాంగ్స్ పెట్టి డిజైన్ చేశాము. మొదటిలో చేసేద్దాం ఏముంది అనుకున్నాను. కానీ షూటింగ్ టైంకి ఈ అమ్మాయితో ఎలా చేయాలని కొంచెం టెన్షన్ పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News