MAA Representants Meets To Bhatti: తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణ పోరాటంలో తాము సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (మా) ప్రకటించింది. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని మా కార్యవర్గం వెల్లడించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మా కార్యవర్గం సమావేశమైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కావడంతో డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివ బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు.
Also Read: Gaddar Awards: 'గద్దర్ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్ బాబు ఏమన్నారంటే..?
అనంతరం మంచు విష్ణుతోపాటు ఇతర ప్రతినిధులు కొన్ని నిమిషాల పాటు భట్టి విక్రమార్కతో పలు విషయాలపై చర్చించారు. సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం అందించాల్సిన సహాయంపై చర్చించినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన విషయాలను మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు 'ఎక్స్'లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఫొటోలు విడుదల చేశాడు. 'ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవడం చాలా సంతోషంగా ఉంది. మేం చాలా విషయాలపై చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. ప్రస్తుత విపత్కర సమయంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి డ్రగ్స్ రహిత సమాజం సృష్టించేందుకు కృషి చేద్దాం' అని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా 'డగ్స్‌కు తెలంగాణ వ్యతిరేకం' అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు.
కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులపై స్థానంలో 'గద్దర్ అవార్డు'లను ప్రకటించడంపై విష్ణు తండ్రి, నటుడు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. గద్దర్ పేరు మీదుగా అవార్డులు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఇక విష్ణు, మోహన్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలకు వస్తే తన కలల ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో కొన్ని రోజుల పాటు జరిగింది. త్వరలోనే ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం శ్రమిస్తోంది.
Honored to meet Telangana Deputy Chief Minister Shri @Bhatti_Mallu garu. Discussed plans for a joint campaign against drugs on behalf of the Telugu film industry. We stand united with the state government in this crucial fight. Together, let's build a drug-free society! 🎬🤝… pic.twitter.com/iwmz9ca5h8
— Vishnu Manchu (@iVishnuManchu) February 5, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి