Naga Chaitanya Birthday: ‘లవ్ స్టోరీ’ మూవీ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Last Updated : Nov 23, 2020, 03:20 PM IST
Naga Chaitanya Birthday: ‘లవ్ స్టోరీ’ మూవీ పోస్టర్ రిలీజ్

Naga Chaitanya Birthday- Love Story movie poster release: టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ రోజు నాగ చైతన్య (Naga Chaitanya ) జన్మదినం సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'లవ్ స్టోరి' (love story) నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయితే ఈ పోస్టర్‌లో నాగచైతన్య పల్లెటూరి అబ్బాయిలా కనిపించాడు. లుంగీ, బనియన్ మీద సాధారణ యువకుడి అవతారంలో ఉన్న పోస్టర్‌ను చూసి నాగ చైతన్య అభిమానులు సంబరపడుతున్నారు. Also read: Vishnu Manchu: ఢీ సినిమా సీక్వెల్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్

నాగ చైతన్యలవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తోంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేసింది. 

 Also read: Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News