Love Story Movie : సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న లవ్‌స్టోరి మూవీ.. ఒక్కరోజులోనే అన్ని కోట్లు వసూలు చేసిందట

Love Story first day collection : కరోనా నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనుకుంటున్న తరుణంలో లవ్‌స్టోరీ మూవీ అందరి అనుమానాలను పటాపంచలు చేసేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 03:45 PM IST
  • కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్న లవ్‌స్టోరీ
  • మొదటి రోజు భారీ కలెక్షన్లు
  • కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్‌ అయి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న మూవీగా లవ్‌స్టోరీ
Love Story Movie : సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న లవ్‌స్టోరి మూవీ.. ఒక్కరోజులోనే అన్ని కోట్లు వసూలు చేసిందట

Love Story movie first day collection: సాయి పల్లవి, నాగచైతన్య కలిసి నటించిన మూవీ లవ్‌స్టోరి. ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్‌లతో దూసుకెళ్తోంది. శేఖర్‌ కమ్ముల (sekhar kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజైంది. కరోనా (Corona) నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనుకుంటున్న తరుణంలో లవ్‌స్టోరీ (Lovestory) మూవీ అందరి అనుమానాలను పటాపంచలు చేసేసింది. 

మొదటి రోజే లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లపైగా వసూలు చేసిందని టాక్. ఒక్క యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టిందట. కరోనా సెంకడ్‌ వేవ్‌ (corona second wave) తర్వాత ఇంత భారీ ఓపెనింగ్‌ కలెక్షన‍్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయట. ఒక్క నైజాం నుంచే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చిందని టాక్. సీడెడ్ నుంచి కోటికి పైగా షేర్ వచ్చిందని తెలుస్తోంది. వెస్ట్, గుంటూరు ఏరియాల్లో, ఒక్కో సెగ్మెంట్ నుంచి అరకోటికి పైగా షేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read : Modi Special Gifts: కమలా హ్యారిస్‌కు అపురూపమైన బహుమతి అందించిన మోదీ

లవ్‌స్టోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 32.8 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని టాక్‌. నైజాం ఏరియాలో (Nizam Area) 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. మొత్తానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్‌ అయి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న మూవీగా లవ్‌స్టోరీ (Lovestory) నిలిచింది.

Also Read : ఎవరు ఈ స్నేహా దుబే? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News