Liger Distributors Protests లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండను పాన్ ఇండియన్ హీరోగా నిలబెట్టాలని పూరి జగన్నాథ్ తెగ ప్రయత్నం చేశాడు. అలానే హిందీ ప్రేక్షకుల తన సత్తా ఏంటో చాటాలని పూరి కూడా బాగానే కసి మీదుండేవాడు. అదే క్రమంలో లైగర్ సినిమాను భారీ ఎత్తున దేశమంతా ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో విజయ్ సైతం కాస్త దూకుడుగానే వ్యవహరించాడు. ప్రమోషన్స్‌లో విజయ్ ప్రవర్తన తీరు విమర్శలకు దారి తీసింది. చివరకు సినిమా ఘోరాతిఘోరంగా దెబ్బ కొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు తొంభై కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టింది.
లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లంతా కూడా పూరి, ఛార్మీల మీద గుస్సా అయ్యారు. ధర్నా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ధర్మాను ప్లాన్ చేశారని పూరి జగన్నాథ్ తెలుసుకుని స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. సినిమా హిట్ అయితే డబ్బులు వస్తే.. లాభాల్లో మాకు వాటా ఏమైనా ఇస్తున్నారా? అంటూ వారిని ఎదురు ప్రశ్నించాడు. అయినా మా వల్ల నష్టం వచ్చింది కదా? అని మేం ఆదుకునేందుకు సిద్దంగానే ఉంటామని, ఇలా బెదిరిస్తే మాత్రం ఏ ఒక్కరికీ ఏమీ ఇవ్వను అని పూరి హెచ్చరించాడు.
ఇంత వరకు పూరి నుంచి ఎలాంటి నష్టపరిహారం రాకపోవడంతో లైగర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాలోనే ఆచార్య గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఇలా అందరూ కూడా తిరిగి ఇచ్చారని అన్నారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు పదమూడు కోట్లు తిరిగి ఇచ్చారని లైగర్ డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు. పూరి కూడా తమ నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేయాలని అడుగుతున్నారు.
Also Read: Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?
ఇస్మార్ట్ శంకర్‌తో ఊపిరి తీసుకున్న పూరి జగన్నాథ్.. లైగర్ సినిమాతో కోలుకోలేనంత కిందికి వెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ డబుల్ ఇస్మార్ట్ అని సినిమాను రామ్‌తో పూరి ప్లాన్ చేశాడు. ఒక వేళ తమకు సెటిల్మెంట్ చేయకపోతే.. ఆ సినిమా ఎలా విడుదలవుతుందో తాము చూస్తామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook