Lata Mangeshkar Awards: లెజెండరీ లతా మంగేష్కర్ ఇక లేరు. పాటలతో మంత్రముగ్దుల్ని చేసిన స్వరకోకిల అందర్నీ విడిచి వెళ్లిపోయారు. 93 ఏళ్ల లతా మంగేష్కర్ జీవితంలో సాధించిన రివార్డులు, అవార్డులు, పురస్కారాల్ని ఓసారి పరిశీలిద్దాం.
నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత రత్న లతా మంగేష్కర్ ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఇవాళ కాస్సేపటి క్రితం చివరి శ్వాస తీసుకుంది. 93 ఏళ్ల లతా మంగేష్కర్ మరణంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. కోవిడ్ సోకడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జనవరి 8వ తేదీన చేరిన ఆమె అదే ఆసుపత్రిలో ప్రాణం వదిలారు. ఆమె మరణంపై పలువురు నేతలు, సెలెబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు.
పాటల మాంత్రికురాలు, స్వరకోకిల లతా మంగేష్కర్ (Lata Mangeshkar )కెరీర్‌లో పొందిన అవార్డులు, రివార్డులు, పురస్కారాల జాబితా చాలా పెద్దదే. ఆమె మరణానికి నివాళిగా ఆ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
1959 బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1963 బీస్ సాల్ బాద్‌లో పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1966 ఖాందాన్ సినిమాలో పాటలకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు
1966 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు
1966 బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు
1969 పద్మ భూషణ్ అవార్డు
1970 ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1972 నేషనల్ ఫిల్మ్ అవార్డు
1974 రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలిగా ఘనత
1974 కోరా కాగజ్ సినిమా పాటలకు బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డు
1977 బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు
1989 ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కారం
1989 పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవం
1990 చెన్నైలో రాజా లక్ష్మి అవార్డుతో సత్కారం
1990 బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డు
1993 జీవితకాల సాఫల్యపు పురస్కారం
1994 ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు
1996 స్టార్ స్క్రీన్ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు
1996 రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డు
1997 రాజీవ్ గాంధీ అవార్డు
1997 మహారాష్ట్ర భూషణ్ అవార్డు
1998 దక్షిణ భారత ఎడ్యుకేషనల్ సొసైటీచే లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు
1999 జీ సినిమా అవార్డు
1999 ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
2000 ఐఐఎఫ్ఏ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు
2001 హీరో హోండా స్టార్‌డస్ట్ మేగజైన్‌చే మిల్లీనియం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు
2001 భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవం
2002 ఆశా భోంస్లే అవార్డుతో సత్కారం
2004 ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు
2007 ఫ్రాన్స్ దేశపు అత్యున్నత అవార్డు
2008 వన్ టైమ్ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు
2009 ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు
2019 90వ జన్మదినాన డాటర్ ఆఫ్ నేషన్ అవార్డుతో సత్కారం
Also read: Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook