Lata Mangeshkar Wealth: రూ.370 కోట్ల విలువైన లతా మంగేష్కర్ ఆస్తికి వారసుడు ఎవరు?

Lata Mangeshkar Wealth: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణం తర్వాత ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందని బాలీవుడ్ ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.370 కోట్ల విలువైన ఆస్తులకు వారసులు ఎవరనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 03:02 PM IST
    • లతా మంగేష్కర్ ఆస్తి ఎవరికి చెందుతుందని బాలీవుడ్ లో చర్చ?
    • లతా సోదరుడు హిరుదయనాథ్ మంగేష్కర్ కు చెందే అవకాశం!
    • దాదాపుగా రూ.370 కోట్ల విలువైన ఆస్తులు ఉండొచ్చని అంచనా
Lata Mangeshkar Wealth: రూ.370 కోట్ల విలువైన లతా మంగేష్కర్ ఆస్తికి వారసుడు ఎవరు?

Lata Mangeshkar Wealth: ఇండియన్ నైటింగల్, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న ఎంతో మంది ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో వేల పాటలు పాడిన లతా మంగేష్కర్.. కరోనా బారిన పడి ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్నా.. అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం (ఫిబ్రవరి 6) కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆస్తులపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 

సంగీతానికే తన జీవితాన్ని అంకితం చేసిన లతా మంగేష్కర్.. పెళ్లి చేసుకోలేదు. 1942లో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రూ.25 నుంచి రూ.40 లక్షల వరకు పాటలను పాడేందుకు ఆమె ఎదిగారు. సుదీర్ఘమైన సంగీత కెరీర్ లో ఎన్నో పాటలను పాడడం సహా మరెంతో సంపదను ఆర్జించారు లతా మంగేష్కర్. 

అయితే ఆమె సంపద దాదాపుగా రూ.370 కోట్లు ఉంటుందని అంచనా. ఈ సంపదకు వారసులు ఎవరు అంటూ ఇప్పుడు చర్చ నడుస్తున్న క్రమంలో ఓ పేరు బయటకు వచ్చింది. లతా మంగేష్కర్ సోదరుడు హిరుదయనాథ్ మంగేష్కర్.. ఈ రూ.370 కోట్ల విలువైన ఆస్తికి వారసుడని సమాచారం. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. 

లతా మంగేష్కర్ ఆస్తుల వివరాలు

గాయని లతా మంగేష్కర్ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.370 కోట్లు. ముంబయిలోని విలాసవంతమైన ప్రాంతమైన పీటర్ రోడ్డులో ఆమె నిర్మించిన 'ప్రభుకుంజ్ భవన్' అనే బంగ్లా ఉంది. ఆ ఇల్లు కోట్ల రూపాయల విలువను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆమె ధరించే అందమైన చీరలు, ఆభరణాలు అంటే ఆమెకు చాలా ఇష్టం. లతా మంగేష్కర్ కు కార్లు అంటే మహా ఇష్టం. ఎన్నో ఖరీదైన కార్లను ఆమె సొంతం చేసుకుంది.  

Also Read: Lata Mangeshkar's Unknown facts: తొలి పాటతోనే అవమానం, అడ్డంకులు.. అయినా ఆగని లతా మంగేష్కర్

Also Read: Lata Mangeshkar: లతా మంగేష్కర్​కు కన్నీటి వీడ్కోలు- ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News