Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అమెకు అధికారిక లాంచనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. లతా మంగేష్కర్ మేనళ్లుడు ఆదినాథ్ మంగేష్కర్ అమె చితికి నిప్పు పెట్టారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ ఇవాళ (ఆదివారం) ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, షారుక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ సహా పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.
లతా మంగేష్కర్‌ను చివరి సారి చూసిన వేలాది మంది అభిమానులు, మంబయి వాసులు కన్నీటి వీడ్కోలు చెప్పారు. దీనితో శివాజీ పార్క్ పరిసరాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
లతా మంగేష్కర్ పార్థీవ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి.. అమె ఇంటి వద్ద సైనిక వందనం సమర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేలాంది మంది అభిమానుల మధ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. అడుగడుగునా అమెకు పూలు జల్లుతూ వీడ్కోలు పలికారు జనం.
Mortal Remains of singer Lata Mangeshkar consigned to flames with full state honours, at Shivaji Park, Mumbai pic.twitter.com/a7vYdVUQm1
— ANI (@ANI) February 6, 2022
మహారాష్ట్ర సంతాప దినాలు..
భారతరత్న లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో అమె గౌరవార్థం.. మహారాష్ట్ర ప్రభుత్వం రేపు అధికారిక సెలవు ప్రకటించింది. మూడు రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలిపింది.
Also read: Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే
Also read: Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..యాధృచ్ఛికమా కాదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook