Lata Mangeshkar's Unknown facts: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న (ఆదివారం) తుది శ్వాస విడిచారు. అమె మృతి పట్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సంతాపం ప్రకటిచారు.
సంగీత ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులను సంపాధించకున్నారు లతా మంగేష్కర్. అందుకే ఆమె భౌతికంగా లేకపోయినప్పటికీ అభిమానుల హృదయాల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారు. అంతే కాకుండా అమె పాడి పాటలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు.
లతా మంగేష్కర్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి అమె సాధించిన విజయాలు మాత్రమే. కానీ ఆమెకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అలా లా మంగేష్కర్ జీవితం గురించి ఎక్కువ మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంగీత కళాకారుల కుటుంబంలో లతా మంగేష్కర్..
లతా మంగేష్కర్ చిన్నప్పటి నుంచే సంగీతం మధ్య పెరిగారు. అమె తండ్రి ఓ థియేటర్ కంపెనీని నడిపేవారు. లతా మంగేష్కర్ సోదరి ఆశాబోస్లే పాటలు పాడటం ప్రారంభించినప్పుడు.. వారిద్దరి లక్ష్యం తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం మాత్రమే.
ఓ పాత ఇంటర్వ్యూలో అమే స్వయంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 'నా చిన్నప్పుడు మా నాన్న.. తన శిష్యుడిన ఓ రాగం ప్రాక్టిస్ చేయమని సూచించారు. అయితే ఆ సమయంలో అతడు చిన్న పొరపాటు చేయగా పక్కనే ఆడుకుంటున్న నేను దానిని సరిదిద్దడం మా నాన్న చూశారు. అప్పుడు మా నాన్న నాన్ను కూడా శిష్యురాలిగా గుర్తించారు.' అని చెప్పుపొచ్చారు లతా మంగేష్కర్.
మొదటి పాటను సినిమా నుంచి తొలగించారట..
లతా మంగేష్కర్ 1942లో మరాఠీ సినిమా అయిన కిటి హసాల్ అనే సినిమాలో తొలి పాట పాడారు. 'నాచు యా గదే, ఖేలు సారి మణి హౌస్ భారీ' అంటూ సాగే ఆ పాటను సినిమా ఎడిటింగ్‌లో తీసేశారు.
సాంగ్ రికార్డ్ చేస్తూ మూర్చపోయిన లతా మంగేష్కర్..
ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఓ వింత అనుభవాన్నిలతా మంగేష్కర్ చెప్పొచ్చారు. ఓ సారి ఎండాకాలంలో మిట్ట మద్యాహ్నం పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు మూర్చపోయి కింద పడిపోయినట్లు చెప్పారు లతా మంగేష్కర్. రికార్డింగ్‌లో డిస్టబెన్స్ వస్తుందని రికార్డింగ్ స్టూడియోలో ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి రికార్డింగ్ చేయడం వల్ల ఉక్కపోపత ధాటికి అలా జరిగినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఏసీలు లేవని చెపారు.
తన పాటలు తాను వినని లతా మంగేష్కర్..
లతా మంగేష్కర్ ఓ సారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తన పాటలు తాను ఎప్పుడూ వినని చెప్పారు. ఎందుకంటే..తన పాటలు తాను వింటే వాటిల్లో వందల తప్పులు తనకు తెలుస్తాయన్నారు. ఈ కారణంగానే తన పాటలు తాను విననని తెలిపారు.
లతా మంగేష్కర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..
పాత తరం నుంచి కొత్త తరం వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లకు లతా మంగేష్కర్ పాటలు పాడారు. అందులో అమెకు మధన్ మోహన్ అంటే చాలా ఇష్టమని 2011లో అమె చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ విషయాన్ని పక్కకు పెడితే.. అన్నా చెల్లెలుగా తాము కలిసిమెలిసి ఉండేవాళ్లమని చెప్పారు.
లతా మంగేష్కర్ ఎంపీ కూడా...
లతా మంగేష్కర్ 1999 నుంచి 2005 వరకు రాజ్య సభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఆ పదవిపై తనకు అయిష్టత ఉండేదని కూడా ఓ సారి అమె వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అమెరకు గౌరవం, సత్కారాలు..
భారతీయ పాటలనే ఎక్కువగా పాడిన లతా మంగేష్కర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అమె పాటలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వింటుంటారు.
లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతయురాలు లతా మంగేష్కర్ కావడం విశేషం. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం 2007లో లతా మంగేష్కర్‌ను 'ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్' అవర్డుతో సత్కరించింది. ఇది ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం.
2019లో లతా మంగేష్కర్ చివరి పాట..
లతా మంగేష్కర్ తన చివరి పాటను 2019లో పాడారు. ఇండియన్ ఆర్మి, దేశాన్ని ఉద్దేశిస్తూ 'సుగంద్ ముజే ఇస్ మిట్టి కి' అనే పాటను పాడారు. పాట 2019 మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఈ పాటకు మయురేశ్ పాయ్ సంగీతమందించారు.
Also read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
Also read: Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు- ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook