Krithi Shetty Pics: రెడ్ శారీలో కృతి శెట్టి.. కుర్రాళ్ల మ‌దిని దోచుకుంటున్న బేబమ్మ!

Actress Krithi Shetty's red saree photo shoot goes viral.  కృతి శెట్టి తాజాగా రెడ్ శారీలో మెరిసిపోయారు. బేబమ్మ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 08:51 PM IST
  • రెడ్ శారీలో కృతి శెట్టి
  • కుర్రాళ్ల మ‌దిని దోచుకుంటున్న బేబమ్మ
  • సారీలోనూ సెగలు పుట్టిస్తున్న కృతి
Krithi Shetty Pics: రెడ్ శారీలో కృతి శెట్టి.. కుర్రాళ్ల మ‌దిని దోచుకుంటున్న బేబమ్మ!

Actress Krithi Shetty looks stunning in red saree: 'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు. 

ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బేబమ్మ మోడ్రన్ అమ్మాయిగా అలరించారు. 

కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ 'బంగార్రాజు'లో బేబమ్మ నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టారు.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ డైరెక్టర్ లింగుసామితో కాంబోలో వచ్చిన 'ది వారియర్' సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. 

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో కూడా కృతి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో తెలంగాణ పల్లెపడుచు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం తెలుస్తోంది.

కృతి శెట్టి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా రెడ్ శారీలో మెరిసిపోయారు. బేబమ్మ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: Rhino Hit Truck: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. సహించేది లేదంటున్న అస్సాం సీఎం!

Also Read: IND vs SA: రెండో వన్డేలో ఫన్నీ ఘటన.. టాస్‌ కాయిన్‌ మర్చిపోయిన జవగల్ శ్రీనాథ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News