Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?

Tomorrow Bank Holoiday: సాధారణంగా  మన దేశంలోనే అన్ని బ్యాంకులు ఏవైనా జాతీయ సెలవు దినం రోజే హాలిడే ఉంటాయి. లేకపోతే రెండో శనివారం నాలుగో శనివారం సాధారణంగా అన్ని ఆదివారాల్లో బంద్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే లిస్ట్ లో భాగం.
 

1 /5

 కొన్ని హాలిడేస్ మాత్రం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం బంద్ చేస్తారు. మరి రేపు జూన్ ఫస్ట్ మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవా? ఈ విషయం బ్యాంకు కస్టమర్లు ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడవచ్చు.  

2 /5

రేపు జూన్ ఫస్ట్ చివరి దశ ఎలక్షన్లు కూడా మన దేశంలో జరగనున్నాయి. 57 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉతరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ చంఢీగఢ్‌లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.  

3 /5

ఇదిలా ఉండగా జూన్ 15న మిజోరంలో బ్యాంకులో సెలవు. ఆరోజు వైఎంఏ డే ని పాటిస్తారు. ఇక ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.  

4 /5

జూన్ 17న సోమవారం బక్రీద్ సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు రానుంది. కానీ మిజోరాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో యధావిధిగా కొనసాగుతాయి.జూన్ 18 మంగళవారం జమ్మూ, కాశ్మీర్లో బక్రీద్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.  

5 /5

అయితే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో భాగంగా ఆరోజు బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు. కానీ, రేపు అంటే శనివారం జూన్‌ 1న మొదటి శనివారం సందర్భంగా బ్యాంకులు యథావిధిగా కొనసాగుతాయి. ఎలాంటి సెలవు లేదు.