OTT Release Movies: ఈ వారం ధియేటర్, ఓటీటీ విడుదల కానున్న సినిమాలు

OTT Release Movies: సగటు మనిషికి కాలక్షేపం సినిమానే. ఇటీవలి కాలంలో థియేటరే కంటే ఓటీటీలకే ఆదరణ పెరిగింది. అందుకే సినిమాలు థియేటర్లతో సమానంగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2022, 11:04 PM IST
OTT Release Movies: ఈ వారం ధియేటర్, ఓటీటీ విడుదల కానున్న సినిమాలు

ఇటీవలి కాలంలో థియేటర్లకు క్రేజ్ తగ్గింది. కారణం ఓటీటీ వేదిలకు ఆదరణ పెరగడంతో పాటు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీల్లో సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని సినిమాలైతే కేవలం ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈ వారం ఓటీటీ, థియేటర్ రిలీజ్ కానున్న సినిమాల జాబితా ఇలా ఉంది.

డిసెంబర్ 2న థియేటర్ రిలీజ్ సినిమాలు

హిట్ 2, మట్టి కుస్తీ, జల్లికట్టు బసవ, నేనెవరు, యాక్షన్ హీరో, ఏక్ దమ్ కడక్. ఇందులో ఏక్ దమ్ కడక్ మరాఠీ సినిమా కాగా, యాక్షన్ హీరో హిందీ సినిమా. 

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు

హాట్‌స్టార్

విల్లో వెబ్‌సిరీస్ నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 1 నుంచి రిపీట్, డిసెంబర్ 2 నుంచి ఫ్రెడ్డీ, డైరీ ఆఫ్ ఎ వింపీకీడ్: రోడ్రిక్స్ రూల్స్, మాన్‌స్టర్  సినిమాలు విడుదల కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్

డిసెంబర్ 2న క్రష్డ్ రెండవ సీజన్ విడుదల కానుంది. అదే రోజు వదంతి వెబ్‌సిరీస్‌తో పాటు కాంతార తుళు వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ5

డిసెంబర్ 2న ఇండియన్ లాక్‌డౌన్, మాన్‌సూన్ రాగా కన్నడ వెర్షన్ విడుదల కానున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 29న క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ స్ట్రీమింగ్ కానుంది. ఇక నవంబర్ 30న మై నేమ్ ఈజ్ వెండెట్టా స్ట్రీమ్ అవుతుంది. డిసెంబర్ 1న ట్రోల్, జంగిల్ లాండ్ స్ట్రీమ్ కానున్నాయి. ఇక డిసెంబర్ 2వ తేదీన గుడ్ బై స్ట్రీమింగ్ కానుంది.

Also read: Chiranjeevi Award: అరుదైన అవార్డు అందుకున్న చిరంజీవి.. రాజకీయాలే సినిమా విలువ తెలిసొచ్చేలా చేశాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News