Kiran Abbavaram Engagement: హీరోయిన్ రహస్యతో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ ..

Kiran Abbavaram Engagement: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు వివాహా బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రహస్యతో ఈయన ఎంగేజ్‌మెంట్ జరిగింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2024, 08:00 AM IST
Kiran Abbavaram Engagement: హీరోయిన్ రహస్యతో  కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ ..

Kiran Abbavaram Engagement: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్‌ల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.  గత ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఈ వేడుకలో కిరణ్ అబ్బవరం లైట్ కలర్ కుర్తా ధరించారు. రహస్య పీచ్ కలర్ సారీ ధరంచింది. ఈ నిశ్చితార్ధం దుస్తుల్లో వీళ్లిద్దరు చూడముచ్చటగా కనువిందు చేస్తున్నారు. అంతేకాదు పరస్పరం ఉంగారాలు మార్చుకున్నారు. ఈ పూల్ పండ్ల కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు  మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీళ్లిద్దరి పెళ్లి వచ్చే ఆగష్టులో శ్రావణ మాసంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు చెబుతున్నారు. డేట్ ఎపుడనేది త్వరలో ప్రకటించున్నారు.  రాజస్థాన్ కానీ.. కశ్మీర్‌లో కానీ వీళ్లిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు వీళ్ల సన్నిహితులు చెబుతున్నారు. 

కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్‌లు  తొలి సినిమా 'రాజా వారు రాణి గారు' సినిమాలో కలిసి నటించారు. తొలి సినిమాలోనే వీళ్లిద్దరు తొలి చూపులు చూసుకొని ప్రేమలో పడిపోయారు.  కిరణ్ అబ్బవరం, రహస్య గత కొన్నేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్నారు. అంతేకాదు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. . కిరణ్ అబ్బవరం.. తన జీవితాన్ని ఎపుడు ప్రైవేట్‌గా ఉంచుకుంటున్నారు కిరణ్ అబ్బవరం. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను ఎపుడు గోప్యంగా ఉంచుతారు.

కిరణ్ అబ్బవరం విషయానికొస్తే.. 'రాజా వారు రాణి గారు' సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన దర్శకత్వంలో తెరకెక్కిన 'SR కళ్యాణ మండపం' సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత స్టెబాస్టియన్ PC 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో పలకరించాడు. త్వరలో 'దిల్ రూబా' మూవీతో  పాటు 1970 దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.

Also Read: BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News