Kiara Advani: కొత్త సంవత్సరం కనుక.. రిలేషన్ షిప్‌పై కియారా అద్వానీ అధికారిక ప్రకటన?

కొత్త సంవత్సరం సందర్భంగా కియారా అద్వానీ తన ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారట. సిద్దార్థ్‌ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 02:06 PM IST
  • రిలేషన్ షిప్‌పై కియారా అద్వానీ అధికారిక ప్రకటన
  • సిద్దార్థ్‌ మల్హోత్రాతో డేటింగ్‌
  • త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న కియారా
Kiara Advani: కొత్త సంవత్సరం కనుక.. రిలేషన్ షిప్‌పై కియారా అద్వానీ అధికారిక ప్రకటన?

గత కొంత కాలంగా బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఒక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ వివాహం చేసుకోగా.. మరో జంట కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తన రిలేషన్ షిప్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారని బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరం (New Year 2022) సందర్భంగా కియారా తన ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారట. సిద్దార్థ్‌ మల్హోత్రా (Siddharth Malhotra)తో కియారా గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రా (Kiara-Siddharth)లు హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడంతో పాటు ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు కూడా వైరల్‌ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కొత్త సంవత్సరం (New Year 2022) సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అధికారికంగా (Kiara-Siddharth Relationship official) ప్రకటించడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌ కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.

Also Read: Snake Eating Itself: వైరల్ వీడియో.. తనను తాను తినడానికి ప్రయత్నిస్తున్న పాము! చివరికి ఏమైందంటే?

కియారా అద్వానీ (Kiara Advani), సిద్దార్థ్‌ మల్హోత్రా (Siddharth Malhotra)లు తొలిసారి 'షెర్షా' సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అప్పడినుంచి ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికినప్పుడు హాలీడే వెకేషన్స్‌కి వెళుతున్నారు. సిద్దార్థ్ షేర్షా సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. కియారా ప్రస్తుతం శంకర్, రాంచరణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. వినయ విధేయ రామ, భారత్ అనే నేను సినిమాలతో కియారా తెలుగులో మంచి హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. 

Also Read: Cloth Masks : క్లాత్ మాస్క్‌లు ప్రమాదకరమా? వైరస్‌ను అడ్డుకోలేవంటోన్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News