KGF 2 Collection: రాజమౌళిని వెనక్కినెట్టిన ప్రశాంత్ నీల్? ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టిన KGF 2!

KGF 2 Collection: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్ 2'. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డును కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ ను 'కేజీఎఫ్ 2' సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 12:57 PM IST
KGF 2 Collection: రాజమౌళిని వెనక్కినెట్టిన ప్రశాంత్ నీల్? ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టిన KGF 2!

KGF 2 Collection: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఇటీవలే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్స్ ను సాధించడంతో పాటు ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా హిందీ మార్కెట్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం నెలకొల్పిన సరికొత్త రికార్డులను ఇప్పుడు 'కేజీఎఫ్ 2' మూవీ బద్దలు కొడుతోంది. 

'కేజీఎఫ్ 2' విడుదలైన వారం తర్వాత దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ మూవీ రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' రూ. 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కేవలం 'ఆర్ఆర్ఆర్' మూవీ హిందీ వర్షెన్ కు రూ. 250 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడీ రికార్డును 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' కొల్లగొట్టనుంది. దాదాపుగా రూ. 256 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను 'కేజీఎఫ్ 2' మూవీ సాధించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కలెక్షన్స్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

KGF 2 హిందీ వర్షెన్ కలెక్షన్స్..

ఏప్రిల్ 14 (గురువారం) : రూ.53.95 కోట్లు

ఏప్రిల్ 15 (శుక్రవారం) : రూ.46.79 కోట్లు

ఏప్రిల్ 16 (శనివారం) : రూ.42.90 కోట్లు

ఏప్రిల్ 17 (ఆదివారం) : రూ. 50.35 కోట్లు

ఏప్రిల్ 18 (సోమవారం) : రూ. 25.57 కోట్లు

ఏప్రిల్ 19 (మంగళవారం) : రూ. 25 కోట్లు

ఏప్రిల్ 20 (బుధవారం) : రూ. 15-17 కోట్లు (అంచనా)

దీంతో హిందీ మార్కెట్లో గత వారం రోజుల్లో 'కేజీఎఫ్ 2' మూవీకి రూ. 255 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

Also Read: Movies Releasing This Week: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!

Also Read: KGF 2 Movie Scenes: 'ఇంద్ర' సినిమాలోని సన్నివేశాన్ని కాపీ కొట్టిన 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News