Atharva Teaser : కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరాలు నటించిన చిత్రం అథర్వ. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మించాడు.
తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆకాష్ పూరి, అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఒక నిమిషం 15 సెకనుల నిడివితో కట్ చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా అందరినీ మెప్పించాయి.
ఆకాష్ పూరి మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని మెచ్చుకున్నాడు. క్లూస్ టీమ్ వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుందని అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నాడు. క్లూస్ టీం అనే సబ్జెక్టుతో వస్తున్న సినిమా ఇదని, తాము ఎక్కువగా బి హైండ్ ద స్క్రీన్ లో ఉంటామని, ఇన్వెస్టిగేటర్స్ ముందుంటారు అని క్లూస్ టీం హెడ్ వెంకన్న అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook