MAA Elections 2021: మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసిన పోలీసులు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా ఆ ఎన్నికలు రేపిన వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితాలపై ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 11:50 AM IST
  • మా ఎన్నికలు ముగిసినా ఆగని వివాదం
  • మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసే అవకాశముందని ఫిర్యాదు చేసిన ప్రకాశ్ రాజ్
  • మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ రూమ్ సీజ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
 MAA Elections 2021: మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసిన పోలీసులు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా ఆ ఎన్నికలు రేపిన వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితాలపై ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సీజ్ చేశారు.

అత్యంత ఆర్భాటంగా, వివాదాస్పదంగా సాగిన మా ఎన్నికలు(MAA Elections2021) ముగిశాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మధ్య జరిగిన పోరులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. మా ఎన్నికలు ముగిసినా వివాదం మాత్రం ఇంకా సమసిపోలేదు. రోజురోజుకూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం ఇంకా వేడెక్కుతోంది. మరోవైపు మా ఎన్నికల ఫలితాలపై గందరగోళం నెలకొంది. ప్యానెల్ సభ్యులు రిగ్గింగుకు పాల్పడ్డారంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మా ఎన్నికల రోజున మోహన్ బాబు, నరేష్ తదితరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. అంతేకాకుండా దాడి దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో ఉన్నాయని ఎన్నికల అధికారికి లేఖ రాశారు. తమకు ఆ సీసీటీవీ ఫుటేజ్ వివరాలు అందించాలని కోరారు. అయితే సీసీటీవీ ఫుటేజ్(MAA Elections CCTV Footage) అలా ఇవ్వలేమని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తేల్చిచెప్పారు.

దాంతో సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తూ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రకాశ్‌రాజ్(Prakash raj). ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు..ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులోని సీసీటీవీ ఫుటేజ్ సర్వర్ రూమ్‌కు తాళాలు వేశారు. మొత్తానికి మా ఎన్నికలు ముగిసినా..వివాదం మాత్రం ఇంకా సమసిపోలేదు. 
 

Also read: Microsoft: చైనాకు షాక్, లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేసిన మైక్రోసాఫ్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News