Jr NTR Lipo Surgery News: నందమూరి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే తన వంశం పరువు నిలబెట్టాడు. నిన్ను చూడాలని సినిమాతో ఆయన హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ వెంటనే చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలో ఆయన చేసిన ఆది, రాజమౌళి దర్శకత్వంలో చేసిన సింహాద్రి వంటి సినిమాలో ఆయనకి బాగా క్రేజ్ తీసుకొచ్చాయి.
ఆ తర్వాత ఆంధ్రవాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. అయితే అప్పట్లో ఆయనకు ప్రధానమైన సమస్య ఒకటే ఉండేది. ఎందుకంటే ఎన్టీఆర్ బాగా బొద్దుగా కనిపిస్తూ ఉండడంతో ఇతర హీరోల అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తూ ఉండేవి. ఒకానొక దశలో ఆయనకు సినిమా అవకాశాలు కూడా ఆగిపోతాయా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాఖీలో ఎన్టీఆర్ ను చూస్తే మీరు ఈ విషయాన్ని ఒప్పుకుని తీరతారు.
ఇక సరిగ్గా అలాంటి సమయంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమా కోసం ఆయన లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సర్జరీ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ బరువులో సగానికి సగం తగ్గిపోయారు. ఆ తరువాత తన గత ఫోటోలను ప్రస్తుత ఫోటోలను చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక డైట్ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ గా హీరో మెటీరియల్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకరకంగా అలా తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ ని మార్చేసింది. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కంత్రీ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా అదుర్స్, బృందావనం లాంటి సినిమాలు భారీ హిట్ గా నిలిచాయి.
తర్వాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము వంటి సినిమాలు ఇబ్బంది పెట్టినా బాద్షా సినిమాతో హిట్టు అందుకున్నాడు. మళ్ళీ రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు డిజాస్టర్లుగా నిలిచినా టెంపర్ సినిమాతో హిట్టు కొట్టి అప్పటి నుంచి ఇక అపజయమే ఎరుగని విధంగా ముందుకు దూసుకు వెళుతున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఆయన స్టార్ గా మారిపోయాడు. తనను వెక్కిరించే వారి నోళ్లను మూయిస్తూ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిన తీరు పలువురు అభినందిస్తున్నారు.
Also Read: Rashmika Mandanna Dress: డాషింగ్ హాట్ డ్రెస్సులో రష్మిక దర్శనం.. 'బెల్లంకొండ'కు హగ్గిస్తూ అందాల విందు!
Also Read: Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి