Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్(Bigg Boss). గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన జెస్సీ(Jessie).. తన ఆరోగ్య పరిస్థితిపై ‘బిగ్‌బాస్’తో చర్చించారు. ‘‘జస్వంత్ మీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు పడలేదనే విషయం మీక్కూడా తెలుసు. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకురావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి’’ అని బిగ్‌బాస్ సూచించాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన జెస్సీ.. ‘‘నేను బిగ్‌బాస్ హౌస్ వదిలివెళ్లిపోతున్నాను’’ అని ప్రకటించాడు. ఈ ఊహించని పరిణామంతో హౌస్మేట్స్ షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్ సిరి(Siri), షణ్నుక్ కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read: PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గత కొన్ని రోజులుగా జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి(సోమవారం)ఎపిసోడ్లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవగా, అతన్ని సీక్రెట్ రూంలో ఉంచి చికిత్స అందించారు. గతంలో సంపూర్ణేష్ బాబు, తర్వాత గంగవ్వ, నోయల్ ఇలా గేమ్ మధ్య నుంచి బయటకు వచ్చేసిన వారే. మరోవైపు జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని టాక్ నడుస్తోంది.
Health issue valla #Jessie house bayatiki vellalsi undi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/GDDNA5VNyc
— starmaa (@StarMaa) November 9, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook