Janhvi Kapoor Tollywood: ఆ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ?

Janhvi Kapoor Tollywood: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor News) ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కానుందని సమాచారం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రూపొందనున్న సినిమాలో (NTR Koratala Siva Movie) ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 01:37 PM IST
    • టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్
    • ఎన్టీఆర్ – కొరటాల శివ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం?
    • సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
Janhvi Kapoor Tollywood: ఆ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ?

Janhvi Kapoor Tollywood: ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor News) ప్రస్తుతం బాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. హీరోయిన్ గా తొలి చిత్రం ‘ధడక్’ సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది జాన్వీ. సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్ లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడిపేస్తుంది. ఇప్పుడామె టాలీవుడ్ లో (Janhvi Kapoor Next Movie) అడుగుపెట్టేందుకు సిద్ధమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

గతంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో జాన్వీ కపూర్ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ అందుకు సంబంధించిన ఏ విషయాలు తెలియరాలేదు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ .. జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. 

అయితే.. తాజాగా జాన్వీ ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమైందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో (NTR Koratala Siva Movie)జాన్వీ హీరోయిన్ గా చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో ముందుగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆ స్థానంలో జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న (RRR Movie Release Date) విడుదలకు సిద్ధంగా ఉంది.  

Also Read: 'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదుర్స్..

Also Read: నాన్న గారి ఆరోగ్యంపై దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు... కైకాల కుమార్తె రమాదేవి విజ్ఞప్తి..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News