Janhvi Kapoor @ Tirumala: తిరుమలలో లంగావోణిలో జాన్వీ కపూర్.. సాష్టాంగా నమస్కారం చేసిన బాలీవుడ్ భామ

Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 10:12 AM IST
  • నెట్టింట్లో జాన్వీ కపూర్ సందడి
  • తిరుమలతో దర్శనమిచ్చిన జాన్వీ
  • సాష్టాంగ నమస్కారం చేసిన జాన్వీ
Janhvi Kapoor @ Tirumala: తిరుమలలో లంగావోణిలో జాన్వీ కపూర్.. సాష్టాంగా నమస్కారం చేసిన బాలీవుడ్ భామ

Sridevi Daughter Janhvi Kapoor Visits Tirumala: అందాల తార, స్వర్గీయ శ్రీదేవీ తనయగా జాన్వీ కపూర్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇంత వరకు జాన్వీ కపూర్‌కు సరైన సినిమా పడలేదు. బాక్సాఫీస్ వద్ద హిట్ పడలేదు. కమర్షియల్‌ హీరోయిన్‌గా, లక్కీ హీరోయిన్‌గా పేరు రాలేదు. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న కొత్త చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది.

మొన్నే ఈ మూవీ షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే తాజాగా జాన్వీ కపూర్ తిరుమల కొండ మీద దర్శనం ఇచ్చింది. తిరుపతి వెంకన్న స్వామిని జాన్వీ కపూర్ దర్శించుకుంది. మామూలుగా అయితే నెలకు ఒకసారి అన్నట్టుగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని జాన్వీ కపూర్ దర్శించుకుంటుంది. ఇక జాన్వీ కపూర్ కాలి నడకన కూడా వెళ్తుంటుంది. జాన్వీ కపూర్ లంగావోణి ధరించి, ఎంతో సంప్రదాయబద్దంగా కనిపిస్తుంంటుంది.

జాన్వీ కపూర్‌కు దైవ భక్తి ఎక్కువే అన్న సంగతి  తెలిసిందే. అందులోనూ తిరుమల పుణ్యక్షేత్రం అంటే మరీ ఇష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె ఏడాదికి కనీసం ఐదారు సార్లైనా తిరుపతికి వెళ్తుంటుంది. ఆ స్వామిని దర్శించుకుంటుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం లంగావోణిలో సందడి చేయగా.. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కపూర్‌కు ఇంతకు ముందే తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని అంగీకరించలేదు. విజయ్ దేవరకొండతో నటించే చాన్స్ వచ్చింది. కానీ ఆమె తిరస్కరించింది. లైగర్ సినిమాలో ముందుగా ఆమెను తీసుకోవాలని అనుకున్నారు. కానీ జాన్వీ ఆ సినిమా చేయకపోవడమే మంచిదైందని అంతా అనుకున్నారు. రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌లతో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందనే ఆలోచనను రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌లు ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే.

 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News