Naga Vamsi Sitara Banner : సితార, హారిక సంస్థలపై ఐటీ రైడ్స్!.. అందుకే టార్గెట్ చేశారా?

IT Raids on Naga Vamsi టాలీవుడ్ సినీ ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల మీద ఈ మధ్య ఎక్కువగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఎక్కువగా సినీ ప్రముఖుల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 06:12 PM IST
  • టాలీవుడ్ మీద ఐటీ కన్ను
  • సితార, హారిక బ్యానర్ల మీద రైడ్స్
  • నాగ వంశీని విచారించిన అధికారులు
Naga Vamsi Sitara Banner : సితార, హారిక సంస్థలపై ఐటీ రైడ్స్!.. అందుకే టార్గెట్ చేశారా?

IT Raids on Sitara Entertainment టాలీవుడ్ ప్రముఖుల మీద, నిర్మాణ సంస్థల మీద ఐటీ అధికారులు ఫోకస్ పెట్టేశారు. ఈ మధ్య ఎక్కువగా ప్రముఖుల ఇళ్లలో, వారి వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ సినిమాలు తీస్తూ, ట్యాక్సులు కట్టకుండా భారీ లాభాలను ఆర్జిస్తున్న వారి మీద ఐటీ తన పంజాను విసురుతున్నట్టుగా కనిపిస్తోంది.

బుధవారం నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లకు సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టేశారు. అలానే నిర్మాత నాగ వంశీని సైతం ఐటీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిప్పుడు ఎలాంటి పెద్ద సినిమాలను రిలీజ్ చేయలేదు.. సితార బ్యానర్ మీద చిన్న సినిమాలే వస్తున్నాయి. ఇప్పుడు ఒక వేళ ఐటీ రైడ్స్ చేయాలని అనుకుంటే.. అది మైత్రీ మూవీస్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించాలి కానీ ఇలా సితార, హారికల మీద ఎందుకు చేసి ఉంటారు? అని అంతా అనుకుంటున్నారు.

అయితే ఈ ఐటీ రైడ్స్‌లో ఎలాంటి విషయాలు గానీ, అవకతవకలు గానీ గుర్తించలేదని తెలుస్తోంది. ఇప్పుడు నాగ వంశీ అయితే మహేష్‌ బాబు త్రివిక్రమ్ సినిమా ప్రారంభంలో బిజీగా ఉన్నాడు. నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేటి సెట్‌లో మహేష్‌ బాబు అడుగు పెట్టినట్టుగా తెలుస్తోంది.

మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న ఈ హ్యాట్రిక్ మూవీని ఆగస్ట్ 11న విడుదల చేయబోతోన్నామని నిర్మాత నాగ వంశీ ఈ మధ్యే ప్రకటించాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీలలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారని కూడా క్లారిటీ ఇచ్చాడు.

Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News