Dil Raju: దిల్ రాజు తల్లికి గుండె పోటు..?.. ఐటీ అధికారుల వాహానంలోనే ఆస్పత్రికి తరలింపు..

Dil raju mother hospitalized: దిల్ రాజు తల్లి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హుటా హుటీన కుటుంబ సభ్యులు ఐటీ అధికారులు వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 23, 2025, 03:00 PM IST
  • నిర్విరామంగా కొనసాగుతున్న ఐటీ దాడులు..
  • దిల్ రాజు తల్లికి ఆస్పత్రి పాలు..
Dil Raju: దిల్ రాజు తల్లికి గుండె పోటు..?.. ఐటీ అధికారుల వాహానంలోనే ఆస్పత్రికి తరలింపు..

Dil raju mother hospitalized: దిల్ రాజు తల్లి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హుటా హుటీన ఐటీ అధికారులు వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు. నిర్మాత దిల్ రాజు ఇంట్లో కంటీన్యూగా మూడోరోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుతో పాటు, పుష్ప2 డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో కంపెనీ అధినేత రామ్ వీరపనేని కంపెనీలపై సైతం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం  ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మరింది. . ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఐటీ అధికారుల వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా ఒక అధికారిణిని సైతం.. దిల్ రాజు తల్లితో పాటు.. వారి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి తీసుకెళ్లారు.

Read more:  Saif Ali Khan: జాక్ పాట్ కొట్టేసిన సైఫ్‌ను కాపాడిన ఆటోవాలా.. భారీ నజరాన ప్రకటించిన సింగర్..

ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఒక్కసారిగా దిల్ రాజు అభిమానులు తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు. అంతే కాకుండా.. కొంత మంది దిల్ రాజు తల్లికి  ఛాతీలో నొప్పి వచ్చిందని, గుండెపోటుకు గురయ్యారేమోనని కూడా కొంత మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతు టెన్షన్ కు గురౌతున్నారు. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం దిల్ రాజు కుటుంబ  సభ్యులు లేదా పర్సనల్ టీమ్  నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.  

ఐటీ అధికారులు.. దిల్ రాజు  కొడుకు శిరీష్, కూతురు హన్సీత రెడ్డి, బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 55 బృందాలుగా  విడిపోయిన అధికారులు గత రెండు రోజులుగా దాడులు  చేస్తు హల్ చల్ చేస్తున్నారు.  దిల్ రాజు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నామ్, డాకు మహారాజ్ మూవీస్ భారీ బడ్జెట్ తో అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన అన్ని చోట్ల ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు పుష్ప2 మూవీకు సంబంధించిన వాళ్లంతా.. ఇటీవల ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారని కొంత మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News